Punjab Election Results 2022: పంజాబ్ లో టాప్ లేపుతున్న ‘ఆప్’..స్థానిక పార్టీలను ఊడ్చిపారేస్తోంది

పంజాబ్ అంసెంబ్లీ ఎన్నికల్లో టాప్ లేపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ( ‘ఆప్’’) ఆధిక్యంలో దూసుకుపోతోంది. ..స్థానిక పార్టీలను ఊడ్చిపారేస్తోంది.

Punjab Election Results 2022: పంజాబ్ లో టాప్ లేపుతున్న ‘ఆప్’..స్థానిక పార్టీలను ఊడ్చిపారేస్తోంది

Punjab Election Results 2022

Punjab Election Results 2022: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు విడుదల ఉత్కంఠను రేపుతోంది. అనుకున్నట్లుగానే నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగిస్తుంటే పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం దుమ్ములేపుతోంది. స్థానిక పార్టీలను తన పార్టీ గుర్తు అయిన చీపురుతో ‘ఊడ్చిపారేస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇది ఊహించని పరిణామంగా పంజాబ్ స్థానిక పార్టీలు భావిస్తున్నారు. పంజాబ్ లో కాంగ్రెస్ ను కుప్పకూల్చి భారీ ఆధిక్యం దిశగా ఆప్ హవా కొనసాగిస్తోంది.

దీంట్లో భాగంగా ఆప్ పార్టీనుంచి పోటీ చేసిన పంజాబ్ లో గ్రాండ్ సక్సెస్ అయింది ఆప్ ఢిల్లీ మోడల్. ఆధిక్యం దిశగా కొనసాగుతున్న ఆప్ ప్రభుత్వ వ్యతిరేక పార్టీ ఓట్లను క్యాష్ చేసుకుంటోంది. ఆప్ హవాలో కాంగ్రెస్,అకాలీదళ, బీజేపీలు కొట్టుకుపోతున్నాయి. దీంతో ఆప్ పార్టీ నేతలు ఢిల్లీల్లో సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఆప్ కార్యాలయం వద్ద కార్యకర్తలు డ్యాన్సులు చేస్తు తమ ఆనందాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఆప్ ఎన్నికల గుర్తు అయిన చీపురు పట్టుకుని సంతోషంగా డ్యాన్సులు వేస్తున్నారు. బాణాసంచా కాల్చి మిఠాలు పంచుకుంటున్నారు.

Also read : Punjab AAP CM Candidate: పంజాబ్ సీఎం అభ్యర్థి ఇంట్లో మొదలైన సంబరాలు

ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తీరు కనిపిస్తోంది. గోవా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఉదయమే ప్రారంభమై కొనసాగుతున్న క్రమంలో ఆప్ మాత్రం తన కొత్త హవాను కొనసాగిస్తోంది.

అలాగే ఇప్పటి వరకు అధికారంలోఉన్న ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గాలీ చాలా సానుకూలగంగా వీస్తోంది. 403 స్థానాలకు గాను.. ఇప్పటి వరకు వెలువడిన ట్రెండ్స్ ను పరిశీలిస్తే బీజేపీ 199 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. సమాజ్ వాదీ పార్టీ 99 చోట్ల, బీఎస్పీ 6 స్థానాల్లో, కాంగ్రెస్ 4 చోట్ల ముందంజలో ఉన్నాయి.

Also read : Punjab Election Results 2022: ఊపుమీదున్న ఆప్.. దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తప్పవా?

పంజాబ్ లో ఆప్ హవా నడుస్తోంది. 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 59 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ 38, శిరోమణి అకాలీదళ్ 18, బీజేపీ 4 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తుంటే ఆప్ మాత్రం వాటిని దాటి హవా కొనసాగిస్తోంది.గోవాలో బీజేపీ అధికారం దిశగా ప్రయాణిస్తోంది. మొత్తం 40 స్థానాలకు గాను బీజేపీ 17 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 10 స్థానాల్లో, ఆప్ ఒక్క స్థానంలో లీడ్ లో ఉన్నాయి.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 70 స్థానాలకు గాను బీజేపీ 34 చోట్ల, కాంగ్రెస్ 18 స్థానాల్లో ఆధిక్యం చూపిస్తున్నాయి. మణిపూర్ రాష్ట్రంలో 60 స్థానాలకు గాను బీజేపీ 23 చోట్ల గెలుపు దిశగా పయనిస్తోంది. కాంగ్రెస్ 14 స్థానాల్లో, ఎన్ పీపీ 13 చోట్ల ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.