Punjab AAP CM Candidate: పంజాబ్ సీఎం అభ్యర్థి ఇంట్లో జిలేబీలతో సంబరాలు
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ సంబరాలు మొదలైపోయాయి. సీఎం అభ్యర్థి భగవత్ మన్ ఇంటి వద్ద సంప్రాదాయ నృత్యం బాంగ్రా డ్యాన్స్ చేస్తూ.. జిలేబీలు తయారుచేస్తూ...

Punjab Election Results 2022
Punjab AAP CM Candidate: పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ సంబరాలు మొదలైపోయాయి. సీఎం అభ్యర్థి భగవత్ మన్ ఇంటి వద్ద సంప్రాదాయ నృత్యం బాంగ్రా డ్యాన్స్ చేస్తూ.. జిలేబీలు తయారుచేస్తూ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. ఇంటి నిండా పూలతో డెకరేట్ చేస్తూ.. పండుగ వాతావరణం కనిపిస్తుంది.
సంగ్రూర్ నియోజకవర్గం నుంచి మే2014లో ఎంపీగా సేవలందించిన భగవత్ ను అభిప్రాయ సేకరణ ద్వారా ఎంపిక చేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.
ఎన్నికల ఫలితాల రోజైన గురువారం మార్చి 10న ఉదయం భగవత్ కుటుంబం చంకౌర్ సాహిబ్ గురుద్వారాకు వెళ్లి ప్రార్థనలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వర్షంలా కురుస్తున్నాయి.
Read Also: ముందు చెప్పినట్లేనా.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలెలా ఉన్నాయ్!
117 సీట్లకు గానూ మ్యాజిక్ ఫిగర్ దాటేసి ఆప్ దూసుకుపోతుంటే బీజేపీ 5సీట్లకు కూడా చేరుకోలేకపోయింది. మరోవైపు కాంగ్రెస్ క్లీన్ బౌల్డ్ కాగా బీజేపీకి ఆప్‌లో సగం ఓట్లు కూడా దక్కలేదు.