Punjab Election Results 2022: ఊపుమీదున్న ఆప్.. దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తప్పవా?

దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తప్పవా?ఆమ్ ఆద్మీ పార్టీ.. చీపురు పట్టింది. ఒక్కో రాష్ట్రాన్ని ఊడ్చేయాలనుకుంటోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న ఈ చిన్న పార్టీ..

Punjab Election Results 2022: ఊపుమీదున్న ఆప్.. దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తప్పవా?

Punjab Results

Punjab Election Results 2022: దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తప్పవా?ఆమ్ ఆద్మీ పార్టీ.. చీపురు పట్టింది. ఒక్కో రాష్ట్రాన్ని ఊడ్చేయాలనుకుంటోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న ఈ చిన్న పార్టీ.. ఇప్పుడు దేశ రాజకీయాల్లోనూ పెనుమార్పులు తీసుకొచ్చేలా మారింది. ఓవైపు కేంద్రంతో ఢీ అంటూనే.. చుట్టుపక్కల రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. పంజాబ్‌లో ఆ దిశగా అడుగులు వేస్తోంది. పంజాబ్‌ ఫలితాల్లో ఆప్‌.. కింగ్‌లా మారబోతోందని సర్వేలు తేల్చేశాయి. దీంతో ఇవాళ్టి కౌంటింగ్‌లో ఆ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయన్నది మరికొద్దిగంటల్లో తేలిపోనుంది.

Manipur Election Results 2022: మణిపూర్‌లో మళ్లీ కమలం వికసిస్తుందా?… హస్తం హవా చూపిస్తుందా

2017 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఈ సారి పంజాబ్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్.. పంజాబ్‌‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అటు కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత పరిణామాలు కూడా ఆప్‌కు బాగా కలిసివచ్చాయనే చెప్పాలి. ఇక మరో జాతీయ పార్టీ బీజేపీ కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ.. పంజాబ్‌ను గెలవలేకపోతుంది. ఫలితంగా పంజాబ్‌లో ప్రభుత్వ ఏర్పాటు తమదేనన్న నమ్మకం ఆప్‌లో ఏర్పడింది.

Goa Results : గోవా అంటేనే గోడ దుంకుడు..! అధికారంపై పార్టీల్లో గుబుల్

ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటి నుంచి కేజ్రీవాల్ క్రేజ్ మామూలుగా పెరగలేదు. ముఖ్యంగా అక్కడ అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీలను కాదని మరో విపక్షం ఆప్ సాధించబోతున్న విజయం కచ్చితంగా దేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురానుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Election Results 2022: బీజేపీ ఆధిక్యం.. యూపీలో సెంచరీ దాటిన కమలం

గతంలో ఢిల్లీలో ఆప్ స్పల్ప మెజారిటీతో గట్టెక్కింది. అప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై తమ ఉమ్మడి ప్రత్యర్ధి అయిన ఆప్ ను దెబ్బతీశాయి. దీంతో ఢిల్లీ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. దాని ప్రభావంతో కాంగ్రెస్ పూర్తిగా మటు మాయం కాగా.. బీజేపీ నామమాత్రంగా మారిపోయింది. ఇప్పటికీ ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ గురించిన చర్చ బాగా తగ్గిపోయింది. ఇప్పుడు పంజాబ్ లోనూ ఆప్ గెలిస్తే అక్కడ కూడా రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Punjab Results : పంజాబ్ పల్స్ ఏంటి..? కేజ్రీవాల్ ‘చీపురు’తో ఊడ్చేయనున్నారా..?

ప్రస్తుతం కేంద్రంలో మోదీ సర్కార్ తో ముఖాముఖీ పోరాడుతున్న టీఎంసీ, డీఎంకే, టీఆర్ఎస్, సమాజ్ వాదీ, శివసేన వంటి పార్టీలకు ప్రస్తుతం తమ రాష్ట్రాలు దాటితే బలం శూన్యం. కానీ ఆప్ పరిస్థితి అలా కాదు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ఇప్పటికే పంజాబ్ లో విపక్షంగా కూడా ఉంది. ఈసారి పంజాబ్ లో గెలిచి అధికారం చేపడితే ఆప్ చేతుల్లోకి రెండో రాష్ట్రం వచ్చినట్లవుతుంది. దీంతో పాటు ఢిల్లీ సీఎంగా ఉన్న ఆప్ అధినేత కేజ్రివాల్ పాపులారిటీ మరింత పెరగడం ఖాయం. అదే సమయంలో మోదీతో పోరాడుతున్న కేజ్రీవాల్ కు అండగా నిలిచేందుకు మిగతా ప్రాంతీయ పార్టీలు కూడా క్యూ కట్టే అవకాశముంది. ఇలా ఏ విధంగా చూసినా పంజాబ్ లో ఆప్ విజయం కచ్చితంగా దేశ రాజకీయాలకు ప్రత్యామ్నాయాన్ని చూపించే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.