Manipur Election Results 2022: మణిపూర్‌లో మళ్లీ కమలం వికసిస్తుందా?… హస్తం హవా చూపిస్తుందా
మణిపూర్‌లో ఏం జరగబోతోంది. మళ్లీ కమలం వికసిస్తుందా?... హస్తం హవా చూపిస్తుందా?. అక్కడ మరోసారి అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ప్రస్తుత పరిస్థితి కమలం వర్సెస్..

Manipur Results
Manipur Election Results 2022: మణిపూర్‌లో ఏం జరగబోతోంది. మళ్లీ కమలం వికసిస్తుందా?… హస్తం హవా చూపిస్తుందా?. అక్కడ మరోసారి అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ప్రస్తుత పరిస్థితి కమలం వర్సెస్ కాంగ్రెస్‌గా కనిపిస్తున్నా.. మరోసారి కమలవికాసం ఖాయమన్నాయి ఎగ్జిట్ పోల్స్. గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన హస్తం పార్టీ.. ఈసారి రెండో స్థానానికే పరిమితమవుతుందని అంచనా వేశాయి. కాంగ్రెస్‌ను వెనక్కినెట్టి సీఎం బీరెన్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ మరోసారి అధికారాన్ని చేపట్టనున్నట్లు సర్వేలు తేల్చిచెప్పాయి.
Election Results 2022: బీజేపీ ఆధిక్యం.. యూపీలో సెంచరీ దాటిన కమలం
మొత్తంగా 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్‌లో మెజారిటీ కోసం 31 సీట్లు గెలవాలి. అయితే ఇక్కడ అధికారం బీజేపీకి దక్కే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఏ పార్టీతో పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీచేసిన బీజేపీ అత్యధిక స్థానాలు గెల్చుకోనుందని తేల్చిచెప్పాయి. కాంగ్రెస్‌కు మరోసారి ప్రతిపక్ష స్థానం తప్పదని తెలిపాయి. ఇండియాటుడే, జీన్యూస్ ప్రకారం ఇక్కడ అధికారం బీజేపీదే. ఇండియాటీవీ కూడా బీజేపీ అటూ ఇటుగా బయటపడొచ్చని చెప్పింది. ఇక జన్‌కీబాత్, ABP సీ ఓటర్ సర్వేలు మాత్రం బీజేపీ మెజారిటీ మార్క్‌కు కాస్త దూరంగా ఆగిపోవచ్చన్నాయి. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులు కనీసం రెండంకెల స్థానాలు కూడా సాధించలేరని తెలిపాయి.
Uttarakhand Results : ఉత్తరాఖండ్.. హోరాహోరీ తప్పదా..?
బీజేపీ 33 శాతం.. కాంగ్రెస్ 29 శాతం వరకు ఓట్లు సాధించవచ్చని చెబుతున్నాయి. అయితే… ఏ సర్వే కూడా కాంగ్రెస్‌ను అధికార పీఠ దరిదాపుల్లోకి చేర్చలేదు. ఒకవేళ హంగ్ వస్తే… 5నుంచి 10 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశమున్న NPPదే కీలకపాత్ర కానుంది. మరోవైపు.. మణిపూర్ ముఖ్యమంత్రి రేసులో బీజేపీ నేత బీరెన్ సింగ్ ముందు వరుసలో ఉన్నారు.
Goa Results : గోవా అంటేనే గోడ దుంకుడు..! అధికారంపై పార్టీల్లో గుబుల్
2017 మణిపూర్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 28 సీట్లతో విజయం సాధించింది, బీజేపీకి 21, ఇతరులకు 11 వచ్చాయి. మొత్తం ఓట్లలో బీజేపీకి 36.28శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు 35.11 ఓట్లు వచ్చాయి. అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినా.. ప్రభుత్వం ఏర్పాటుచేయడంలో విఫలమయింది. దీంతో 21 సీట్లను గెలుచుకున్న బీజేపీ… NPF, NPP, LJPతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Punjab Results : పంజాబ్ పల్స్ ఏంటి..? కేజ్రీవాల్ ‘చీపురు’తో ఊడ్చేయనున్నారా..?
అయితే ఈసారి… బీజేపీ ఒంటరిగా పోటీచేసింది. ఎలాంటి పొత్తులు లేకుండా రంగంలోకి దిగింది. మరోవైపు కాంగ్రెస్… ఆరు రాజకీయ పార్టీలతో కూటమిని ఏర్పాటు చేసింది. దానికి మణిపూర్ ప్రోగ్రెసివ్ సెక్యులర్ అలయన్స్-MPSA అని పేరు పెట్టింది. వీటితోపాటు ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా పోటీపడ్డాయి. అయితే… మణిపూర్‌లో ఈ సారి కూడా బీజేపీ నేత బీరెన్‌సింగ్ సీఎం పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. మరి మణిపూర్ ఫలితాలు.. తుది ఫలితాలకు అనుగుణంగా ఉంటాయా.. లేదా తలకిందులవుతాయా? అన్నది వేచిచూడాలి.
Election Results : యూపీలో బీపీ.. గెలుపెవరిది..?
2017 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ముందు ఇండియా టుడే- యాక్సిస్ 60 సీట్లలో… 16 నుంచి 22 బీజేపీకి, 30నుంచి 36 కాంగ్రెస్‌కు, ఇతరులకు 6 నుంచి 11 వస్తాయని లెక్కగట్టింది. ఇండియా టీవీ- సీవోటర్.. బీజేపీకి 2531, కాంగ్రెస్‌కు 17-23, ఇతరులకు 9-15 సీట్లు వస్తాయని అంచనా వేసింది. న్యూస్18- గ్రామీనర్ బీజేపీకి 25, కాంగ్రెస్‌కు 24, ఇతరులకు 11 సీట్లు ఇచ్చాయి.