Arvind Kejriwal: వ్యాక్సినేషన్ పెంచడానికి పీఎం మోడీకి సలహాలిచ్చిన కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం మధ్యాహ్నం ప్రధాని మోడీకి నాలుగు సలహాలు ఇచ్చారు. దేశ రాజధానిలో వ్యాక్సిన్ ప్రొడక్షన్ బూస్ట్ చేయడం కోసం 18నుంచి 44ఏళ్ల గ్రూప్ ...

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం మధ్యాహ్నం ప్రధాని మోడీకి నాలుగు సలహాలు ఇచ్చారు. దేశ రాజధానిలో వ్యాక్సిన్ ప్రొడక్షన్ బూస్ట్ చేయడం కోసం 18నుంచి 44ఏళ్ల గ్రూప్ మధ్యలో ఉన్న వారికి డోసుల కొరత రాకుండా ఉండటానికి సలహాలిచ్చారు.

ప్రభుత్వం నుంచి తీసుకునే అన్ని డోసులు వాడాం. మిగిలిన కొద్ది డోసులు శనివారం సాయంత్రం వరకూ అయిపోతాయి. ఇది చాలా విచారకరం. కేంద్రానికి దీని గురించి లేఖ రాశాం. సరఫరా ఎంత త్వరగా అందితే అంతలా సెంటర్స్ ను రీ ఓపెన్ చేస్తాం’

‘ప్రతి నెల ఢిల్లీలో 80లక్షల డోసులు కావాలి. కానీ, మే నెలలో 16లక్షల డోసులు మాత్రమే వచ్చాయి. జూన్ నెలలో మా షేర్ తగ్గిపోయింది. 8లక్షల డోసులకు కుదించారు. అలాగే జరిగితే సిటీ మొత్తానికి వ్యాక్సినేషన్ చేయాలంటే 30నెలల సమయం పడుతుంది. కొవిడ్ వేవ్ కారణంగా ఇంకెందరి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందో.. అని పేర్కొన్నారు.

ప్రధాని మోడీకి నాలుగు సూచనలు ఇచ్చిన కేజ్రీవాల్..
1. ఇండియాలో ఉన్న వ్యాక్సిన్ మేకర్లు 24గంటల్లోగా భారత్ బయోటెక్ కొవాగ్జిన్ స్టాకులను పెంచాలని చెప్పండి.
2. అంతేకాకుండా కేంద్రం అంతర్జాతీయ వ్యాక్సిన్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ తో చర్చలు జరపాలి. అక్కడి నుంచి కొని రాష్ట్రాలకు పంపాలి.
3. కొన్ని దేశాలు అవసరానికి మించి వ్యాక్సిన్లను తమ వద్దనే ఉంచుకున్నాయి. ఎక్కువ ఉన్న వాటిని ఇండియాకు పంపేయమని చెప్పాలి.
4. అంతర్జాతీయ మ్యాన్యుఫ్యాక్చరర్లు వారి వ్యాక్సిన్ ను ఇండియాలో తయారుచేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలి’ అంటూ ముగించారు కేజ్రీవాల్.

ట్రెండింగ్ వార్తలు