Arvind Kejriwal : కేజ్రీవాల్‌ హెల్త్ పిటిషన్‌పై కోర్టులో విచారణ.. బెయిల్‌ కోసం షుగర్‌ పెంచుకుంటున్నారన్న ఈడీ!

Arvind Kejriwal : శనివారం లోగా కేజ్రీవాల్ డైట్, వైద్య సదుపాయాలు, ఇన్సులిన్ ఇవ్వడం, వర్చువల్‌గా డాక్టర్ కన్సల్టేషన్ పై సమాధానం ఇవ్వాలని తీహార్ జైలు అధికారులు, ఈడీని ఆదేశించింది రౌస్ అవెన్యూ కోర్టు.

Arvind Kejriwal : తీహార్‌ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. జైల్లో కేజ్రీవాల్ ప్రాణాలు తీసే కుట్ర జరుగుతుందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ఓడించలేక బీజేపీ సర్కార్ జైల్లో కేజ్రీవాల్ ప్రాణాలు తీయాలని చూస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also : Ekagrah Rohan : కేవలం 5 నెలల వయస్సులోనే మిలియనీర్.. రూ.240 కోట్ల ఆస్తికి అధిపతిగా ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ముద్దుల మనవడు..!

కేజ్రీవాల్‌ 3వందల పాయింట్లకు పైగా షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నారని.. ప్రతిరోజు 54 యూనిట్ల ఇన్సులిన్ ఇవ్వాలంటున్నారు ఆప్ నేతలు. కేజ్రీవాల్‌కు ఇన్సులిన్, ఇంటి భోజనం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇంటి భోజనాన్ని అడ్డుకునేందుకు మామిడిపళ్ళు, అరటిపళ్ళు తింటున్నారంటూ ఈడీ ఆరోపిస్తోందని మండిపడుతున్నారు ఆప్ నేతలు

మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హెల్త్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. డయాబెటిక్ వైద్యం కోసం ప్రతిరోజు 15నిమిషాలు వర్చువల్‌గా డాక్టర్ కన్సల్టేషన్, ఇన్సులిన్ తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు కేజ్రీవాల్. శనివారం లోగా కేజ్రీవాల్ డైట్, వైద్య సదుపాయాలు, ఇన్సులిన్ ఇవ్వడం, వర్చువల్‌గా డాక్టర్ కన్సల్టేషన్ పై సమాధానం ఇవ్వాలని తీహార్ జైలు అధికారులు, ఈడీని ఆదేశించింది రౌస్ అవెన్యూ కోర్టు.

షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయని.. 15 నిమిషాలు వర్చువల్‌గా డాక్టర్ ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు కేజ్రీవాల్. జైలులో వైద్య సదుపాయాలపై అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 48 సార్లు ఫుడ్ పంపితే అందులో 3 సార్లు మాత్రమే మామిడి పండు ఉందని.. నవరాత్రి ప్రసాదంలో భాగంగా ఒకసారి ఆలు పూరి తిన్నారని కోర్టుకు వివరించారు లాయర్లు. కేజ్రీవాల్ షుగర్ ఫ్రీ టీ తాగుతున్నారని చెప్పారు. నిందితుడు అయినంత మాత్రాన రైట్ టు హెల్త్ లేకుండా పోదన్నారు కేజ్రీవాల్ తరఫు లాయర్.

ఆయనే డైటే కారణం :
డాక్టర్ సూచించిన డైట్‌కి విరుద్ధంగా కేజ్రీవాల్‌కు షుగర్ లెవల్స్ ఉన్నాయంటోంది ఈడీ. కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ పెరగడానికి ఆయనే డైటే కారణమని చెప్పింది. జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని.. షుగర్ లెవల్స్ మెయింటేన్ అవుతున్నాయని ఈడీ కోర్టుకు వివరించింది.

డైట్ చార్ట్ ప్రకారం మాత్రమే ఫుడ్ అనుమతి ఇస్తున్నామని.. షుగర్ లెవల్స్‌పై.. జైలు డాక్టర్లు ఎప్పటికప్పడు మానిటరింగ్ చేస్తున్నారని చెప్పారు ఈడీ అధికారులు. మరోవైపు కేజ్రీవాల్ ఆరోగ్యం, ఆప్ ఆరోపణలపై ఆందోళన వ్యక్తం చేశారు ఢిల్లీ లెఫ్ట్ నెంట్‌ గవర్నర్ సక్సేనా. కేజ్రీవాల్ ఆరోగ్యం, వైద్య సదుపాయాలపై 24 గంటల్లోగా డిటెయిల్డ్‌ రిపోర్ట్ ఇవ్వాలని జైళ్లశాఖ డీజీని ఆదేశించారు. జైలులో సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఎలాంటి అలసత్వాన్ని సహించబోమన్నారు సక్సెనా.

Read Also : YS Sharmila Reddy : వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ షాక్.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులు!

ట్రెండింగ్ వార్తలు