Arvind Kejriwal
ఢిల్లీలో బాణసంచా విక్రయాలు, వాడకం, తయారీ, నిల్వను తాత్కాలికంగా నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ సర్కారు కొన్ని రోజుల క్రితమే ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 1 వరకు అన్ని రకాల టపాసులను పూర్తిగా నిషేధించారు.
గురువారం దీపావళి పండుగ ఉన్న వేళ టపాసులపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆంక్షల విషయం మతానికి సంబంధించినది కాదని, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నమని చెప్పారు. కేజ్రీవాల్ ఇవాళ ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
దీపావళి అనేది వెలుగులకు సంబంధించిన వేడుక అని, బాణసంచా కాల్చితే వచ్చే కాలుష్యం ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని అన్నారు. ముఖ్యంగా పిల్లలపై ఈ ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. పెరిగిపోయిన కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని, బాణసంచా పేల్చకూడదని, దీపాలు వెలిగించాలని సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా చెబుతున్నాయని అన్నారు.
దీపావళి ఓ వెలుగుల పండుగ అని, బాణసంచా కాల్చాల్సిన పండుగ కాదని చెప్పారు. బాణసంచా కాల్చడం వల్ల ఎవరికీ మేలు చేయడం లేదని తెలిపారు. మన కోసం, మన కుటుంబం కోసమే మనం దీన్ని పాటిస్తున్నామని చెప్పారు. ఎటువంటి కాలుష్యం తలెత్తినా మన పిల్లలు బాధపడతారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
KTR: నువ్వా అలా చేసేది..! సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్