Gauri Khan’s Birthday : తల్లి పుట్టిన రోజు..ఆర్యన్ ఖాన్‌‌కు బెయిల్ వస్తుందా ?

షారుఖ్‌ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో 2021, అక్టోబర్ 08వ తేదీ శుక్రవారం జరుగనుంది. శుక్రవారం ఆర్యన్ తల్లి గౌరీ ఖాన్‌ 51వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

Srk

Aryan Khan’s Bail : బాలీవుడ్ స్టార్ షారుఖ్‌ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో 2021, అక్టోబర్ 08వ తేదీ శుక్రవారం జరుగనుంది. శుక్రవారం ఆర్యన్ తల్లి గౌరీ ఖాన్‌ 51వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. దీంతో బెయిల్ పిటిషన్ విచారణపై ఉత్కంఠ నెలకొంది. తమ కుమారుడు ఇంటికి వస్తాడని ఖాన్ కుటుంబం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఆర్యన్ ఖాన్‌కు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. దీంతో వెంటనే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఆర్యన్ తరఫు న్యాయవాది.

Read More : Cruise Drugs Case : షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్‌కు 2 వారాల జ్యుడీషియల్ కస్టడీ

ఈ నెల 11 వరకు తమ కస్టడీకి ఇవ్వాలని ఎన్‌సీబీ అధికారులు న్యాయస్థానాన్ని కోరగా.. ఈ అభ్యర్థతనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇప్పటికే తగినంత సమయం ఇచ్చినందున నిర్బంధ విచారణ అవసరం లేదన్నారు న్యాయమూర్తి. ఆర్యన్‌ ఖాన్‌ను జైలుకు తరలించడంలో ఆలస్యమవడంతో రాత్రంతా ఎన్సీబీ కస్టడీలోనే ఉన్నాడు. మరోవైపు ఆర్యన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఆధారలు సేకరించామని చెబుతున్నారు అధికారులు. అతని ఫోన్‌లో జరిగిన చాటింగ్‌ డేటాను కోర్టుకు అందజేసింది ఎన్సీబీ. తన స్నేహితుల మధ్య డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించి చాటింగ్ జరిగిందని అధికారులు కోర్టుకు తెలిపారు.

Read More : Karnataka : యడియూరప్ప సన్నిహితుల నివాసాల్లో ఐటీ సోదాలు

దీన్ని ఆర్యన్ తరఫు న్యాయవాది ఖండించారు. చాటింగ్‌లో ఆర్యన్ తన స్నేహితులతో ఫుట్ బాల్ ఆటకు సంబంధించి చర్చించుకున్నారని వాదించారు. అది కూడా ఏడాది క్రితం జరిగిన సంభాషణ అని చెప్పారు ఆర్యన్ తరఫు న్యాయవాది. కొత్తగా అధికారులు సేకరించిన ఆధారాలు ఏమీ లేవని…కావాలని ఇరికించే ప్రయత్నం జరుగుతోందన్నారు. మరోవైపు క్రూయిజ్ షిప్ కంపెనీ కార్డెలియా క్రూయిజెస్ సీఈఓకు స‌మ‌న్లు జారీ చేశారు ఎన్సీబీ అధికారులు. విచార‌ణకు హాజరుకావాలని ఎన్సీబీ కోరింది. షిప్‌లో జ‌రిగిన రేవ్ పార్టీ, డ్రగ్స్‌ వ్యవహారంలో అధికారుల ద‌ర్యాప్తున‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని కంపెనీ సీఈఓ తెలిపారు.