Bank Holidays Representative Image (Image Credit To Original Source)
Bank Holidays: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సెలవుల క్యాలెండర్ ప్రకారం జనవరి 2026లో ఈ వారంలో (జనవరి 5 నుంచి 12వ తేదీ వరకు) భారత దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు ఎలాంటి ప్రధాన ప్రభుత్వ, ప్రాంతీయ సెలవులను పాటించవు. శని, ఆదివారాలు మినహా ఈ వారంలో బ్యాంకులకు ఇతర సెలవులు లేవు. జనవరి 2026 ప్రారంభంలో దేశంలోని బ్యాంకులకు పెద్దగా సెలవులు లేవనే చెప్పాలి. కాగా, స్వామి వివేకానంద, మకర సంక్రాంతి, పొంగల్, తిరువళ్లువర్ డే, ఉజ్హవర్ తిరునాల్ సందర్భంగా బ్యాంకులు మూసివేస్తారు.
బ్యాంకులకు తదుపరి సెలవు దినం జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వస్తోంది. జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకునే ఈ రోజు ఆధ్యాత్మిక నాయకుడు, యువతకు ఆదర్శప్రాయుడైన స్వామి వివేకానంద జయంతిని గుర్తుచేస్తుంది. అయితే ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే బ్యాంకులు మూసివేయబడతాయి.
జనవరి 2026లో బ్యాంక్ సెలవులు..
జనవరి 14: మకర సంక్రాంతి / మాఘ బిహు
మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది. మాఘ బిహు అనేది అస్సాం ప్రజల ముఖ్యమైన పంట పండుగ. అహ్మదాబాద్,
ఈ నగరాల్లో బ్యాంకులు మూసివేస్తారు: భువనేశ్వర్, గౌహతి, ఇటానగర్.
జనవరి 15: ఉత్తరాయణ పుణ్యకాలం / పొంగల్ / మాఘ సంక్రాంతి / మకర సంక్రాంతి
ఈరోజును దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పంటల పండుగగా జరుపుకుంటారు. పొంగల్ అనేది తమిళనాడులో రైతులను, ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే ఒక ప్రధాన నాలుగు రోజుల పండుగ.
ఈ నగరాల్లో బ్యాంకులు మూసివేస్తారు: బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్, హైదరాబాద్, విజయవాడ.
Bank Holidays List (Representative Image (Image Credit To Original Source))
జనవరి 16: తిరువల్లువర్ దినోత్సవం
ఈరోజు తిరుక్కురల్ రచయిత, తమిళ కవి, తత్వవేత్త తిరువల్లువర్‌ను గౌరవించుకుంటారు.
చెన్నైలో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది.
జనవరి 17: ఉళవర్ తిరునాల్
ఉళవర్ తిరునాల్ అనేది తమిళనాడులో వ్యవసాయ కార్మికుల సేవలను గుర్తించడానికి జరుపుకునే రైతుల పండుగ.
చెన్నైలో మాత్రమే బ్యాంకులకు సెలవు ఇస్తారు.
సెలవుల్లో ఆ సేవలు పొందలేరు..
బ్యాంకులో పని ఉండే కస్టమర్లు కచ్చితంగా హాలిడేస్ ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకోవాలి. అందుకు అనుగుణంగా తమ పనులను షెడ్యూల్ చేసుకోవాలి. బ్యాంకులు పని చేయని సమయంలో వెళితే ఇబ్బందులు తప్పవు. కాగా, బ్యాంకు సెలవుల సమయంలోనూ కస్టమర్లు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎంల ద్వారా సేవలను పొందగలరు. అయితే చెక్కుల క్లియరింగ్, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం కిందకు వచ్చే ఇతర కౌంటర్ సేవలు మాత్రం అందుబాటులో ఉండవనే విషయాన్ని గ్రహించాలి.
Also Read: ఘరానా మోసం.. వృద్ధురాలి నుంచి కోటి రూపాయలు కొట్టేసిన సైబర్ క్రిమినల్స్.. మోసం జరిగిందిలా