Asaduddin Owaisi : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుపై మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహు ఒక దయ్యం అని, నిరంకుశుడు, యుద్ధ నేరస్థుడు అని అసద్ ఆరోపించారు....

Asaduddin Owaisi,PM Modi

Asaduddin Owaisi : ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుపై మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహు ఒక దయ్యం అని, నిరంకుశుడు, యుద్ధ నేరస్థుడు అని అసద్ ఆరోపించారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది మరణించిన నేపథ్యంలో గాజా ప్రజలకు సంఘీభావం తెలపాలని, వారికి సహాయం అందించాలని అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.

Also Read : Boat Capsizes : కాంగోలో పడవ బోల్తా..27మంది మృతి

‘‘నేను పాలస్తీనాకు మద్ధతు ఇస్తాను. నేటికీ పోరాడుతున్న గాజా ధైర్యవంతులకు వందనాలు! నెతన్యాహు ఒక దయ్యం, నిరంకుశుడు, యుద్ధ నేరస్థుడు! మన దేశంలో ఒక బాబా ముఖ్యమంత్రి యోగి పాలస్తీనా పేరు చెప్పే వారిపై కేసులు పెడతామని చెప్పారు, అందుకే బాబా ముఖ్యమంత్రిగారూ వినండి, నేను పాలస్తీనా జెండాను, మన త్రివర్ణ పతాకాన్ని కూడా పట్టుకున్నాను. నేను పాలస్తీనాకు అండగా ఉంటాను’’ అని హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఒవైసీ పేర్కొన్నారు.

Also Read :US Sends USS Eisenhower : ఇజ్రాయెల్‌ యుద్ధరంగంలోకి మరో అమెరికా విమాన వాహక నౌక

పాలస్తీనియన్లపై జరుగుతున్న అకృత్యాలను ఆపాలని ప్రధానికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. పాలస్తీనా కేవలం ముస్లింలకు సంబంధించిన విషయం కాదు, ఇది మానవతా సమస్య అని ఆయన చెప్పారు. సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సోమవారం ఇజ్రాయెల్ దళాలు, హమాస్ మిలిటెంట్ గ్రూపుల మధ్య తక్షణం కాల్పుల విరమణ కోసం పిలుపునిచ్చింది.

Also Read :Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి 197 మంది భారతీయులతో ఢిల్లీ వచ్చిన మూడో విమానం

పాలస్తీనా ప్రజల భూమి, స్వరాజ్యం హక్కుల కోసం తమ దీర్ఘకాల మద్దతు ఉందని కాగ్రెస్ చెప్పింది. అక్టోబరు 7వతేదీన హమాస్ ఇజ్రాయెల్‌పై దాడులను ప్రారంభించి, వందలాది మందిని హతమార్చింది. ఈ దాడిలో ఇజ్రాయెల్‌లో 1,300 మందికి పైగా మరణించగా, ఇజ్రాయెల్ ఎదురు వైమానిక దాడుల్లో గాజాలో 3,500 మందికి పైగా మరణించారు.

Also Read :India vs Pakistan : పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ కు కోహ్లీ ఏం బహుమతి ఇచ్చాడో తెలుసా? వీడియో వైరల్