Yogi Adityanath: జర్మనీ ప్రొఫెసర్ ట్వీట్‌పై ప్రపంచ వ్యాప్తంగా ‘యోగి మోడల్’ అంటూ సీఎం కార్యాలయం ట్వీట్.. అసదుద్దీన్ ఒవైసీ సెటైర్లు

ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు. విదేశీయుల ప్రశంసల కోసం బీజేపీ తహతహలాడుతోందని, ఫేక్ అకౌంట్ల ట్వీట్లతో ఆనందాన్ని పొందుతున్నారని ఎద్దేవా చేశారు.

UP CM Yogi Adityanath

Asaduddin Owaisi: ఫ్రాన్స్ రణరంగాన్ని తలపిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడన్న ఆరోపణలపై పోలీసులు 17ఏళ్ల నేహల్ అనే యువకుడిపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో నెహాల్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనను నిరసిస్తూ పౌరులు పెను విధ్వంసమే సృష్టిస్తున్నారు. అయితే, నెహాల్ కారు ఆపకుండా తమ మీదకి దూసుకురావడంతో అతనిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని, దీంతో అందరి ప్రాణాలు కాపాడడానికే అతనిపై కాల్పులు జరిపామన్నది పోలీసుల వాదన. వేలాది మంది యువతీ యువకులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెడుతున్నారు. దీంతో దేశంలో పలు ప్రాంతాలు అగ్నిగుండంగా మారాయి.

France Protests: అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. దేశం మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తున్న ఆందోళనలు

ఫ్రాన్స్‌లో అల్లర్లను ఉద్దేశిస్తూ జర్మనీకి చెందిన ప్రొఫెసర్, కార్డియాలజిస్ట్ ఎన్. జాన్‌కామ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌లో .. ఫ్రాన్స్ అల్లర్లను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 24గంటల్లోనే కట్టడి చేయగలరని రాశారు. ఈ ట్వీట్ పై యోగి కార్యాలయంకూడా స్పందించింది. ప్రపంచంలో ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగినా యోగి మోడల్ ను అనుసరించడం ద్వారా వాటిని కట్టడి చేయవచ్చని ట్వీట్ చేసింది. అయితే, జాన్‌కామ్ ట్విటర్ ఖాతా నకిలీదని పలువురు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ ట్విటర్ ఖాతా చీటింగ్ కేసులో అరెస్టయిన డాక్టర్ నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ కు చెందినదని కామెంట్లు పెడుతున్నారు.

France : ఆందోళనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్ .. కూల్‌గా కూర్చుని సాండ్‌విచ్ తింటున్న కుర్రాడు

సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వైరల్‌గా మారింది. యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం ట్వీట్ పై స్పందించడంపట్ల ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు. విదేశీయుల ప్రశంసల కోసం బీజేపీ తహతహలాడుతోందంటూ విమర్శించారు. ఫేక్ అకౌంట్ల ట్వీట్లతో ఆనందాన్ని పొందుతున్నారా? తప్పుడు ఎన్ కౌంటర్లు, అక్రమ బుల్డోజర్ చర్యలు, బలహీనులను లక్ష్యంగా చేసుకోవటం పరివర్తన విధానం కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే అంటూ అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అసదుద్దీన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.