France : ఆందోళనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్ .. కూల్‌గా కూర్చుని సాండ్‌విచ్ తింటున్న కుర్రాడు

రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటు కూర్చున్నాడట. అటువంటిది జరిగింది ఫ్రన్స్ లో. ఆందోళనలో అట్టుడుకిపోతున్న ఫ్రాన్స్ లోని పట్టణంలో ఓ వ్యక్తి తాపీగా కూర్చుని శాండ్ విచ్ తింటున్న ఘటన ఆసక్తికరంగా మారింది.

France : ఆందోళనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్ .. కూల్‌గా కూర్చుని సాండ్‌విచ్ తింటున్న కుర్రాడు

Man keeps eating sandwich in Nanterre France

Man keeps eating sandwich in Nanterre City France : రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటు కూర్చున్నాడు అనేది ఓనాటినుంచో వస్తున్న మాట. ఇది పక్కన పెడితే తాజాగా ఆందోళనలో అట్టుడుకిపోతున్న ఫ్రాన్స్ లో ఓ వ్యక్తి చేసిన పని వైరల్ గా మారింది. పోలీసుల కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడి మరణం తరువాత ఫ్రాన్స్‌ కల్లోలంగా మారింది. ఓ పక్కన ఆందోళనలు జరుగుతున్నాయి. వాహనాలను ఆందోళనకారులు నిప్పు పెట్టటంతో మంటలు రగులుతున్నాయి.

పరిస్థితి ఇలా ఉంటే ఫ్రాన్స్ (France)లోని పారిస్‌ (Paris)శివార్లలోని డిఫెన్స్‌ డిస్ట్రిక్ట్‌ వద్ద నాంటెర్రె (Nanterre)పట్టణంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓపక్క ఆందోళన నిరసనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. వారిని అదుపు చేయటానికి పోలీసులు వెంటపడుతున్నారు. తన పక్కనే ఇంత జరుగుతున్నా ఓ యువకుడు ఓ చోట కూల్ గా కూర్చుని తాపీగా సాండ్ విచ్ తింటున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంత జరుగుతున్నా అతను ఏమత్రం కంగారుపడకుండ..భయపడకుండా తాపీగా కూర్చుని తినటం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ గమనించాల్సి విషయం ఏటంటే నాంటెర్రె పట్టణంలోనే 17 ఏళ్ల యువకుడిని పోలీసులు కాల్చి చంపారు. అదే పట్టణంలో అల్లర్లు జరుగుతుంటే ఓ యువకుడు శాండ్ విచ్ తింటూ కూర్చోవటం వైరల్ గా మారింది.

రోడ్డుపై ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరుగుతుంటే ఆ పక్కనే ఓ డబ్బా వద్ద కూర్చున్న యువకుడు అదేమీ పట్టనట్టు..ఈ లోకంతో నాకు సంబంధమేలేదన్నంత కూల్ గా కూర్చుని శాండ్‌విచ్ తింటున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పక్కనే అంత పెద్ద ఆందోళనలు జరుగుతుంటే ఓ యువకుడు తనకేమీ సంబంధం లేనట్టు శాండ్‌విచ్ తింటూ కూర్చోవడంపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

France: ఫ్రాన్స్‌లో భారీగా చెలరేగుతున్న ఆందోళనలు.. కనపడిన వాటిని తగులబెడుతున్న నిరసనకారులు.. ఎందుకంటే?

కాగా ఆందోళన కారులను నిలువరించేందుకు పోలీసులు వేల సంఖ్యలో రంగంలోకి దిగారు. ప్రభుత్వం ఒక్క పారిస్ (Paris)నగరంలోనే 40వేల మంది పోలీసులను మోహరించింది. ఆందోళనకారులు శాంతించాలని, నిందితులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తులను పెడచెవిన పెట్టిన ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నారు. ఆందోళనలు చేసేవారిలో యువతే ఎక్కువగా ఉన్నారు. దీంతో పారిస్‌ శివారులోని క్లామర్ట్‌ పట్టణంలో గురువారం (జూన్,2023) రాత్రి కర్ఫ్యూ విధించారు. మరోవైపు యువకుడిపై కాల్పులు జరిపిన పోలీసు అధికారి ప్రాసిక్యూషన్‌ ప్రారంభమైంది. అతనిపై హత్యాభియోగాలు నమోదయ్యాయి.

ఈక్రమంలో నహేను కాల్చి చంపిన పోలీసులు అధికారి అతని కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. వాదనల్లో భగంగా పోలీసు అధికారి తరపు న్యాయవాది మాట్లాడుతు. మనుషులన కాల్చి చంపటం అతని ఉద్ధేశ్యం కాదని..పొరపాటున జరిగిందని వివరించారు. మరోవైపు మృతుడు సహేల్ తల్లి మాట్లాడుతు.. ఒక అధికారి చేసిన ఈ పొరపాటుకు నా బిడ్డ బలైపోయాడని నా బిడ్డను కోల్పోయి నేను అభవించే ఆవేదన ఎవరి అర్థమవుతుంది? అని ప్రశ్నించారు. కానీ ఒక్క అధికారి చేసిన పొరబాటుకు మొత్తం పోలీసుశాఖను తాను నిందించనని అన్నారామె.