కరోనా నుంచి కోలుకున్న రోగికి ఊపిరితిత్తులను విజయవంతంగా మార్పిడి చేశారు. ఆసియాలోనే మొట్టమొదటిసారి ఘనత సాధించిన ఆసుపత్రిగా MG HOSPITAL రికార్డు నెలకొల్పింది. ఆపరేషన్ అనంతరం రోగి కోలుకుంటున్నాడని ఆసుపత్రి మేనేజ్ మెంట్ వెల్లడించింది.
గురుగ్రావ్ కు చెందిన బిజినెస్ మేన్ (48) జూన్ 08వ తేదీన కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ వైరస్ ఊపిరితిత్తులను బాగా దెబ్బ తీసింది. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. ఆసుపత్రికి తరలించి..జూన్ 20వ తేదీన వెంటిలెటర్ పై ఉంచారు. పరిస్థితులు విషమించడంతో అతడిని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు.
ఇక్కడ కూడా వెంటిలెటర్ పై ఉంచి..ఈసీఎమ్ ఓ ట్రీట్ మెంట్ అందించారు. కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యులు నిర్ధారించారు. కానీ..అతని ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీంతో ఊపిరితిత్తులను మార్పిడి చేయాలని నిర్ణయించామని దీనికి సంబంధించిన విభాగం ఛైర్మన్ డా. బాలకృష్ణన్ వెల్లడించారు.
ఆగస్టు 27వ తేదీన విజయవంతంగా ఊపిరితిత్తులను మార్పిడి చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు.