Elephants Ettack :రెచ్చిపోయిన ఏనుగులు.. బీజేపీ నాయ‌కుడిని తొక్కి చంపేసాయి..

అసోంలో గౌహతి నగరానికి సమీపంలో బీజేపీ నాయ‌కుడు రాజీవ్ బోరోను ఏనుగులు తొక్కి చంపాయి.

Assam BJP Worker Trampled to Death by Elephants : అసోంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గౌహతి నగర శివార్ల బీజేపీ నాయ‌కుడు రాజీవ్ బోరోను ఏనుగులు తొక్కి చంపాయి. గువ‌హ‌టి సిటీ శివార్ల‌లోని రాణి రిజ‌ర్వ్ ఫారెస్టులో ఉంటున్న ఏనుగుల మంద‌.. సోమవారం (సెప్టెంబర్ 19,2021) అర్ధ‌రాత్రి రోడ్డుపైకి వ‌చ్చింది. ఆ తరువాత అంధురిజులి గ్రామంలోని 35 ఏళ్ల బీజేపీ శ‌క్తి కేంద్ర క‌న్వీన‌ర్ బోరో నివాసంపై ఏనుగులు దాడి చేశాయి. నేరుగా అతని ఇంటిలోకి దూసుకెళ్లిన ఏనుగులు ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న బోరోను ఏనుగులు తొక్క‌డంతో అత‌ను ప్రాణాలు కోల్పోయాడు.

Read more :Elephant attack : ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు మృతి

ఈ ఘటనపై స‌మాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. బోరో మృత‌దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని రాణి క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌కు త‌ర‌లించారు. కానీ అప్పటికే బోరో మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై ప‌ర్యావ‌ర‌ణ‌, అట‌వీశాఖ మంత్రి ప‌రిమ‌ల్ శుక్ల‌బైద్యా సంతాపం ప్ర‌క‌టించారు.

10 ఏళ్లలో ఏనుగులకు బలైన 888 మంది
కాగా..సాధారణంగా సాధుస్వభాగంగా ఉండే ఏనుగులు కొన్ని సమయాల్లో వైల్డ్ గా వ్యవహరిస్తుంటాయి. దీంతో కంటికి కనిపించినవారిపై దాడులకు దిగుతుంటాయి. ఇటువంటి సందర్భాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అలే గత 10 ఏళ్లలో మనున‌షులు – ఏనుగుల మ‌ధ్య జ‌రిగిన సంఘ‌ర్ష‌ణ‌ల్లో 888 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు అట‌వీ, వన్య‌ప్రాణి సంర‌క్ష‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు.

Read more: International Dog Day 2021 : ఏనుగుతో పోరాడి..యజమాని కుటుంబాన్ని కాపాడిన కుక్క

అలా సోనిట్‌పూర్ జిల్లాలో124 మంది, ఉద‌ల్‌గురి జిల్లాలో 118, గోల్‌పారా జిల్లాలో 78 మంది చ‌నిపోయారు. అసోంలో ఈ ఏడాదిలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏనుగుల దాడిలో 99 మంది మృతి చెందారు.

 

ట్రెండింగ్ వార్తలు