Elephant attack : ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు మృతి
ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లో విషాదం చోటు చేసుకుంది. మదపుటేనుగు దాడిలో ఇద్దరు రైతులు మృత్యువాతపడ్డారు.

Elephant Attack
Elephant attack : ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లో విషాదం చోటు చేసుకుంది. మదపుటేనుగు దాడిలో ఇద్దరు రైతులు మృత్యువాతపడ్డారు. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని, తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా చిగురుమాకులపల్లి వద్ద పొలంలో ఉన్న పాకలో నాగరాజప్ప, చంద్రశేఖర్ అనే రైతులు పొలానికి కాపలాగా ఉన్నారు.
ఆసమయంలో అటుగా వచ్చిన మదపుటేనుగు వీరిపై దాడి చేసి..తొక్కి చంపింది. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్ధలానికి వచ్చి పరిశీలించారు. మదపుటేనుగును బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఏనుగు చిత్తూరు జిల్లా కుప్పంలోకి వచ్చే అవకాశం ఉండటంతో ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు.