International Dog Day 2021 : ఏనుగుతో పోరాడి..యజమాని కుటుంబాన్ని కాపాడిన కుక్క

తన యజమాని కుటుంబాన్ని కాపాడడానికి మదమెక్కిన భారీ ఏనుగుతో పోరాడి ప్రాణాలు వదిలింది ఓ పెంపుడు కుక్క. ప్రాణంగా పెంచుకున్న కుక్క మరణంతో యజమాని కుటుంబంతో పాటు స్థానికులు వేదనపడ్డారు.

International Dog Day 2021 : ఏనుగుతో పోరాడి..యజమాని కుటుంబాన్ని కాపాడిన కుక్క

Mirwais Azizi Richest Man In Afghanistan (1)

International Dog Day…Kerala dog fights with elephant: కాస్త ప్రేమ చూపించి..కడుపు నింపితే చాలు తమ యజమానుల ప్రాణాలకు తమ ప్రాణాల్ని అడ్డు వేసి కాపాడతాయి పెంపుడు కుక్కలు. ఇంటిలో సొంత మనషుల్లా యజమానుల్ని అనుక్షణం కనిపెట్టుకుని ఉంటాయి. యజమానికి ఆరోగ్యం బాగుండ హాస్పిటల్ లో చేరితో హాస్పిటల్ బయటే రోజుల తరబడి వేచి చూసిన పెంపుడు కుక్క గురించి విన్నాం. చిరుతపులి బారిన పడిన యజమానిని కాపాడి ప్రాణాలు వదిలిన కుక్క గురించి విన్నాం. ఇలా యజమానులను కాపాడిన పెంపుడు కుక్కల గురించి చెప్పుకుంటే చాలా సందర్బాలే ఉన్నాయి. ‘కుక్క’ అని తేలిగ్గా తీసిపారేయటనాకి లేదు. కుక్కల కోసం కోట్లు ఖర్చు పెట్టిన యజమానులున్నారు. యజమానుల కోసం ప్రాణాలు అర్పించిన కుక్కలు ఉన్నాయి. ఆగస్టు 26. అంతర్జాతీయ కుక్కల దినోత్సవం సందర్భంగా అలా తన యజమాని కోసం ఏనుగుతో పోరాడిన ఓ పెంపుడు కుక్క గురించి తెలుసుకుందాం. కుక్క విశ్వాసానికి మారు పేరు అనే విషయం తెలిసిందే.

అలా తన యజమాని కుటుంబంపై దాడికి యత్నించిన గజరాజుతో పోరాడింది వారి పెంపుడు కుక్క. ఆ పోరాటంతో యజమాని కుటుంబాన్ని కాపాడగలిగింది.కానీ తన ప్రాణాలను మాత్రం కోల్పోయింది. తన ప్రాణాలు కోల్పోతున్న సమయంలో కూడా యజమాని కుటుంబ సభ్యుల ప్రాణాల కోసం పరితపించింది.

కేరళలోని ఇడుక్కి జిల్లా కంతలూరుకి చెందిన సోమన్ కుటుంబం ఓ కుక్కను పెంచుకుంటోంది. అడవి నుంచి దారి తప్పి వచ్చిన ఓ ఏనుగు పంట పొలాలను నాశనం చేస్తూ సోమన్ ఇంటి దగ్గర ఉన్న వైర్డ్ ఫెన్సింగ్ లో చిక్కుకుంది. ఆ ఫెన్సింగ్​ని కూడా పాడు చేసి..ఆ మదపుటేనుగు సోమన్ ఇంటి వైపు దూసుకొచ్చింది. ఇంటి బయట ఉన్న సోమన్, అతడి భార్య లిథియా, వారి సోదరి వలసమ్మ, పిల్లలు అభిలాష్, అమృతలను చూసింది. అంతే తలకు బాగా తిక్క ఎక్కిన ఆ ఏనుగు వారిని చూసి వెర్రెత్తిపోయింది. వారివైపుగా పరుగులు పెడుతూ వచ్చేసింది.

ఏనుగు తమవైపు వస్తోందని గుర్తించి లోపలికి పరిగెత్తే సమయంలో ఇంటి బయట ఉన్న పిల్లర్ ముందుకు వచ్చేసింది. ఈలోపు వారి పెంపుడు కుక్క టామీ ఏనుగు తన యజమాని కుటుంబంవైపు రావటం చూసింది. అంతే ఒక్కసారిగా చైన్ నుంచి విడిపించుకుని అత్యంత వేగంగా ఏనుగుకు అడ్డుగా వచ్చింది. అలా వచ్చీరాగా ఏనుగు కాలుని తన పళ్లతో గట్టిగా కరిచింది. ఏనుగు కొండంత ఉంటే టామీ క్యూట్ గా ఓ చిన్న సైజులో మాత్రమే ఉంది. అయినా ఏనుగు ఆకారానికి అది భయపడలేదు. తన యజమాని కుటుంబాన్ని కాపాడాలనే తపనతో ఏనుగు ఒక్క తొక్కు తొక్కినా..తొండంతో పట్టుకుని విసిరికొట్టినా తన ప్రాణాలు దక్కవని తెలుసు. కానీ టామీ అవేమీ పట్టించుకోలేదు.

ఏనుగును ఆపటానికే చూసింది. కానీ మదమెక్కి ఉన్న ఆ ఏనుగు టామీ కరవటంతో మరింత కోపంతో రెచ్చిపోయింది. ఆ కుక్క వైపు దూసుకెళ్లింది. టామీ కూడా అరుస్తూ దానిపైకి దూకేందుకు ప్రయత్నించింది. కానీ ఏనుగు ముందు కుక్క ఎంత అన్నట్లుగా అయిపోయింది టామీ పరిస్థితి. ఏనుగు తన బలమైన దంతాలతో టామీ కడుపులో పొడిచి దాన్ని అమాంతం ఓ బొమ్మను ఎత్తినట్లుగా ఎత్తి అలంత దూరంలో విసిరిపారేసింది.

తన కడుపులోకి ఏనుగు దంతం దిగి ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా టామీ ఏనుగు కళ్లలో తన కాళ్లతో గుచ్చుతూ తనని తాను కాపాడుకునేందుకు ప్రయత్నించింది. కళ్లలో గుచ్చడంతో నొప్పి వల్ల ఆ ఏనుగు టామీని అక్కడికక్కడే వదిలేసి తిరిగి వచ్చినదారిలో అడవిలోకి పారిపోయింది. తీవ్రంగా గాయపడిన టామీని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా.. చికిత్స తీసుకుంటూ బుధవారం (ఆగస్టు 25,8.2021) మధ్యాహ్నం మరణించింది.

తమకు కాపాడటానికి టామీ చేసిన త్యాగం తలచుకుని గర్వపడాలో..ప్రాణాలు కోల్పోయిన టామీ గురించి బాధపడాలో తెలియని స్థితిలో సోమన్ కుటుంబం మొత్తం తల్లడిల్లిపోయింది. సోమన్ కుటుంబంతోపాటు స్థానికుల్ని టామీ మరణం కలచివేసింది. కన్నీరుమున్నీరయ్యారు. యజమాని కుటుంబ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తూ… తన ప్రాణాలు వదిలిన టామీ లాంటి పెంపుడు జంతువులు త్యాగాలు ఎన్నో..ఎన్నెన్నో..అంతర్జాతీయ కుక్కల దినోత్సం సందర్భంగా యజమాని కుటుంబాన్ని కాపాడటానికి తన ప్రాణాలు అర్పించిన టామీకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు నెటిజన్లు.