Taj Mahal: బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. తాజ్‌మహల్‌ను కూల్చేయాలంట.. కారణమేమిటంటే?

అస్సాం రాష్ట్రం మరియాని అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే రూప‌జ్యోతి కుర్మీ తాజ్‌మహల్‌ను కూల్చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Taj Mahal

Taj Mahal: తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నం కాదు, తాజ్‌మహల్‌ను వెంటనే కూల్చివేయాలని అస్సాంలోని మరియాని నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రూపజ్యోతి కుర్మీ వ్యాఖ్యానించారు. తాజ్‌మహల్‌నే కాకుండా కుతుబ్‌మినార్‌ను కూడా కూల్చివేయాలని, ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతున్నట్లు తెలిపారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్‌ను నిజంగా ప్రేమించాడా? అనే దానిపై విచారణ సైతం జరపాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణ ఎందుకు జరపాలోకూడా ఎమ్మెల్యే తెలిపాడు. షాజహాన్ ముంతాజ్‌ను ప్రేమిస్తే, ముంతాజ్ మరణం తర్వాత అతను మరో మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడంటూ ప్రశ్నించాడు.

House tax notices for Taj Mahal : తాజ్‌మహల్‌కు పన్ను నోటీసులు..రూ.1.కోటి చెల్లించాలని, లేకుంటే జప్తు చేస్తామని ఆదేశం

మొఘల్ చరిత్రపై కొన్ని అధ్యాయాలను ఎన్‌సీఈఆర్‌టీ (నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌) 12వ తరగతి పాఠ్యపుస్తకాల నుంచి తొలగించినట్లు వచ్చిన వార్తలు వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రూపజ్యోతి కుర్మీ తాజ్‌మహల్‌ను కూల్చాలంటూ చేసిన వ్యాఖ్యలుసైతం మరో వివాదానికి తెరలేపాయి. కుర్మీ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొఘల్ కాలం నాటి రెండు స్మారక కట్టడాల స్థానంలో ఆలయాలు నిర్మించాలని ప్రధాని మోదీని కూడా ఎమ్మెల్యే అభ్యర్థించారు. అంతేకాదు. అలా నిర్మాణం చేసే ఆలయాలకు తన ఏడాది జీతాన్ని విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమని మరియాని నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకటించారు.

Taj Mahal: వివాదంలో తాజ్ మహల్.. కృష్ణుడి విగ్రహంతో ఉన్న పర్యాటకుడికి నో ఎంట్రీ.. హిందూ సంఘాల ఆగ్రహం

మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఏడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. వాస్తవానికి మొఘలలు 1526లో భారతదేశానికి వచ్చారు. ఆ తరువాత వారు తాజ్ మహల్‌ను నిర్మించారు. షాజహాన్ తన నాలుగో భార్య ముంతాజ్ కోసం తాజ్‌మహల్ నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ తాజ్ మహల్‌ను ప్రేమకు సాక్ష్యంగా భావిస్తున్నారు. కానీ, బీజేపీ ఎమ్మెల్యే మాత్రం.. తాజ్ మహల్ ప్రేమకు చిహ్నం కాదని అన్నారు.

 

 

అస్సాం రాష్ట్రం మరియాని అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే రూప‌జ్యోతి కుర్మీ. ఆయన తొలుత కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. మరియాని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2021 సంవత్సరంలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. మళ్లీ మరియాని నియోజకవర్గం నుండి విజయం సాధించాడు. ప్రస్తుతం తాజ్‌మహల్‌ను కూలగొట్టాలంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు