Taj Mahal: వివాదంలో తాజ్ మహల్.. కృష్ణుడి విగ్రహంతో ఉన్న పర్యాటకుడికి నో ఎంట్రీ.. హిందూ సంఘాల ఆగ్రహం

ప్రపంచ పర్యాటక కేంద్రాల్లో ఒకటైన తాజ్ మహల్ తాజాగా వివాదంలో చిక్కుకుంది. శ్రీ కృష్ణుడి విగ్రహం కలిగి ఉన్నాడన్న కారణంగా ఒక పర్యాటకుడిని అనుమతించలేదు. దీనిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Taj Mahal: వివాదంలో తాజ్ మహల్.. కృష్ణుడి విగ్రహంతో ఉన్న పర్యాటకుడికి నో ఎంట్రీ.. హిందూ సంఘాల ఆగ్రహం

Taj Mahal: చారిత్రాత్మక కట్టడం, పర్యాటక ప్రదేశమైన తాజ్ మహల్ వివాదంలో చిక్కుకుంది. కృష్ణుడి విగ్రహంతో తాజ్ మహల్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఒక పర్యాటకుడిని అక్కడి సిబ్బంది ఆపేశారు. ఈ ఘటన ఇటీవల జరిగింది. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన గౌతమ్ అనే పర్యాటకుడు తాజ్ మహల్ సందర్శనకు వచ్చాడు.

Revanth Reddy: ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడమే టీఆర్ఎస్, బీజేపీ ఎజెండా: రేవంత్ రెడ్డి

తనతోపాటు కృష్ణుడి విగ్రహం వెంట తెచ్చుకున్నాడు. అయితే, తాజ్ మహల్ సిబ్బంది.. ఆ విగ్రహంతో తాజ్ మహల్ సందర్శించేందుకు అనుమతించలేదు. దగ్గర్లో ఉన్న ఎవరికైనా విగ్రహం ఇచ్చి తాజ్ మహల్ సందర్శించాలని సూచించారు. దీనిపై గౌతమ్ అసహనం వ్యక్తం చేశాడు. కృష్ణుడిని తమ కుటుంబంలో ఒకడిగా భావిస్తామని, ఆ విగ్రహాన్ని ఎక్కడికి వెళ్లినా తీసుకెళ్తానని చెప్పాడు. అనేక పర్యాటక ప్రాంతాలను ఆ విగ్రహంతోనే సందర్శించానన్నాడు. తాజ్ మహల్ వద్ద మాత్రం తనను అనుమతించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

Viral Video: ఆటోపైకెక్కి స్కూల్‌కెళ్తున్న విద్యార్థులు.. జారిపడితే అంతే! కేసు నమోదు.. వీడియో వైరల్

ఈ అంశంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. శ్రీ కృష్ణుడి విగ్రహం ఉన్న కారణంగా పర్యాటకుడిని అనుమతించకపోవడం సరికాదని అంటున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే, నిరసనలకు దిగుతామని హెచ్చరించారు.