పెళ్లికి కూడా సెలవు తీసుకోకుండా డ్యూటీ చేసిన ఐఏఎస్!

  • Publish Date - September 14, 2020 / 10:15 AM IST

కరోనా కారణంగా ప్రతిచోట కూడా అధికారులు కష్టపడి పనిచేస్తున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్న అనేకమంది విధుల్లో బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, పోలీసులు, డాక్టర్లు, ప్రతి ఒక్కరు కోవిడ్‌–19 విధుల్లో బిజీగా ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఓ ఐఏఎస్‌ ఆఫీసర్ వ్యక్తిగత జీవితం కంటే విధి నిర్వహణే ఎక్కువ అనుకున్నారు.




అందుకే, ఆమె జీవితంలో అత్యంత ముఖ్యమైన తన వివాహానికి కూడా సెలవు తీసుకోలేదు. వరుడే వచ్చి పెళ్లి చేసుకోగా.. ఈ ఘటన అక్కడ చోటుచేసుకుంది. వధువుది హైదరాబాద్‌ కాగా, వరుడు పుణే వాసి. హైదరాబాద్‌కు చెందిన కీర్తి జల్లి 2013 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం అస్సాం లోని చచర్‌ జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు పుణేకు చెందిన వ్యాపారవేత్త ఆదిత్య శశికాంత్‌తో పెళ్లి కుదరగా హైదరాబాద్‌లో పెళ్లి జరగవలసి ఉంది.
https://10tv.in/young-woman-commits-suicide-for-late-marriage/
అయితే బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో ఉన్న చచర్‌ జిల్లా హైలకండిలో ప్రస్తుతం రోజుకు 100 వరకు కోవిడ్‌ కేసులు బయటపడుతుండగా.. ఇలాంటి కీలక సమయంలో విధులను పక్కనబెట్టి, పెళ్లి కోసం హైదరాబాద్‌ వెళ్లడం ఇష్టం లేక వరుడు, అతని కుటుంబంతో మాట్లాడి ఆమె నిర్ణయాన్ని ప్రశంసించారు. వరుడు తన బంధువులతో కలిసి పెళ్లికి ముందే సిల్చార్‌ వెళ్లగా.. కోవిడ్‌–19 ప్రొటోకాల్స్‌ ప్రకారం అక్కడ క్వారంటైన్‌లో గడిపాకే వివాహ తంతు జరిగింది.




కీర్తి అధికారిక బంగ్లాలో బుధవారం ఎలాంటి హంగూ ఆర్భాటాలూ లేకుండా కేవలం కర్ణాటక సంగీతం వినపడుతూ ఉండగా వరుడు తాళికట్టాడు. కేవలం 20 మంది అతిథులు మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. ఈ వేడుకను జూమ్‌ వీడియో యాప్‌ ద్వారా 800 మంది చూశారు. ‘హైదరాబాద్‌లో ఉన్న ఆమె అమ్మానాన్నలకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో ఆమె సోదరి మాత్రమే పెళ్లికి హాజరైనట్లు కీర్తి తెలిపారు.