Scooter Coins : చిల్లర నాణేలతో స్కూటర్ కొనుగోలు.. వైరల్ వీడియో

అసోం రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి స్కూటర్ కొనుగోలు చేశాడు. అంతే.. న్యూస్ లోకి ఎక్కాడు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. అంతా అతడి గురించే చర్చించుకుంటున్నారు. ఎందుకో తెలుసా...

Scooter Coins

Scooter Coins : అసోం రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి స్కూటర్ కొనుగోలు చేశాడు. అంతే.. న్యూస్ లోకి ఎక్కాడు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. అంతా అతడి గురించే చర్చించుకుంటున్నారు. స్కూటర్ కొనడం పెద్ద గొప్పేమీ కాదు. అయినా ఇందులో ఆశ్చర్యం ఏముంది? అనే సందేహాలు కలిగాయా? కచ్చితంగా ఇందులో ఆశ్చర్యం ఉంది.

ఆ వ్యక్తి స్కూటర్ కొనుగోలు చేసింది కరెన్సీ నోట్లతో కాదు, ఆన్ లైన్ పేమెంట్ తో అంతకన్నా కాదు. చిల్లర నాణేలతో. అవును.. ఓ బస్తా నిండా చిల్లర నాణేలు వేసుకుని వెళ్లి షోరూంకి వెళ్లి తనకు నచ్చిన స్కూటర్ కొనుగోలు చేశాడు.

Google Pay అదిరే ఆఫర్.. డిజిటల్ పర్సనల్ లోన్లు ఇస్తోంది.. లక్షల్లోనే..!

వివరాల్లోకి వెళ్తే ఆ వ్యక్తి ఓ స్టేషనరీ దుకాణదారు. కొత్త స్కూటర్ కొనాలని అనుకున్నాడు. అంతే.. ఇందుకోసం చిల్లర నాణేలు పోగేయడం స్టార్ట్ చేశాడు. అలా 8 నెలలుగా చిల్లర పోగు చేశాడు. ఆ డబ్బుతోనే ఇప్పుడు స్కూటర్ కొనేశాడు. బర్ పేటా జిల్లా హౌలీలో ఈ ఘటన జరిగింది.

Reheat Foods : ఈ ఐదు ఆహారాలను మళ్లీ మళ్లీ వేడి చేయొద్దు…ఎందుకంటే

కాగా, ఆ చిల్లర లెక్కించేందుకు షోరూమ్ సిబ్బంది కాస్త శ్రమించాల్సి వచ్చింది. పాపం.. వాళ్లు.. తమ పనులన్నీ మానుకుని మరీ ప్లాస్టిక్ ట్రేలలో వేసుకుని ఆ చిల్లర నాణేలు లెక్కించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకే జీవితంలో సేవింగ్స్ చాలా అవసరం అంటున్నారు నెటిజన్లు. చిన్న మొత్తమో, పెద్ద మొత్తమో.. ఎంతోకొంత డబ్బుని కచ్చితంగా సేవింగ్స్ చేయడం.. భవిష్యత్తులో ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంని కామెంట్ చేస్తున్నారు.