Google Pay అదిరే ఆఫర్.. డిజిటల్ పర్సనల్ లోన్లు ఇస్తోంది.. లక్షల్లోనే..!

కరోనా కాలంలో అంతా ఆన్‌లైన్‌లోనే.. ఆన్‌లైన్ పేమెంట్లు భారీగా పెరిగిపోయాయి. ప్రతిఒక్కరూ బ్యాంకు లావాదేవీలను ఆన్ లైన్ లోనే నిర్వహిస్తున్నారు.

Google Pay అదిరే ఆఫర్.. డిజిటల్ పర్సనల్ లోన్లు ఇస్తోంది.. లక్షల్లోనే..!

Google Pay Digital Loans

Google Pay Digital Loans : కరోనా కాలంలో అంతా ఆన్‌లైన్‌లోనే.. ఆన్‌లైన్ పేమెంట్లు భారీగా పెరిగిపోయాయి. ప్రతిఒక్కరూ బ్యాంకు లావాదేవీలను ఆన్ లైన్ లోనే నిర్వహిస్తున్నారు. బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఉండి బ్యాంకు సర్వీసులను పొందుతున్నారు. డిజిటల్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక ఆన్‌లైన్ పేమెంట్ విధానం మరింత ఈజీ అయింది. Google Pay, PhonePe, Paytm యాప్స్ ద్వారా సులభంగా డిజిటల్ పేమెంట్స్ నిర్వహించుకోవచ్చు. యూజర్లను మరింత ఆకట్టుకునేందుకు డిజిటల్ ప్లాట్ ఫాంలు కూడా ఆఫర్లు మీద ఆఫర్లు గుప్పిస్తున్నాయి.

గూగుల్ పే ప్లాట్ ఫాం కూడా తమ యూజర్ల కోసం డిజిటల్ పర్సనల్ పేమెంట్స్ ఆఫర్ చేస్తోంది. అందుకోసం గూగుల్ పే యూజర్లకు రూ. లక్ష వరకు పర్సనల్ లోన్ ఆఫర్ అందిస్తోంది. ఈ డిజిటల్ పర్సనల్ లోన్ ఆఫర్ పొందాలంటే గూగుల్ పే యూజర్లు (Google Pay Users) తప్పనిసరిగా క్రెడిట్ స్కోరు (Credit Score) కలిగి ఉండాలి.

Google Pay Digital Loans (1)

ఈ క్రెడిట్ స్కోరు ఆధారంగానే గూగుల్ పే తమ యూజర్లకు లక్ష వరకు లోన్ అందిస్తోంది. గూగుల్ పే (Google Pay) ప్రీ క్వాలిఫైడ్ యూజర్లకు DMI Finance అనే కంపెనీ ద్వారా Digital Personal Loans Offer తీసుకొచ్చింది గూగుల్ పే.. ఈ లోన్ ఆఫర్ అర్హత కలిగిన యూజర్లు కేవలం నిమిషాల వ్యవధిలోనే లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు. ఈ లోన్ మొత్తాన్ని 36 నెలలు ( 3 Years)లోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

గూగుల్ పే యూజర్ల అందరికి ఈ లోన్ ఆఫర్ వర్తించదు.. గూగుల్ పే యూజర్లు ఆన్ లైన్ పేమెంట్స్ విధానంలో మంచి క్రెడిట్ హిస్టరీ కలిగి ఉండాలి. క్రెడిట్ స్కోరు బాగుంటేనే పర్సనల్ లోన్ పొందే అవకాశం ఉంటుంది. లక్షలాది మంది గూగుల్ పే యూజర్లు పారదర్శకంగా తొందరగా లోన్లు పొందేందుకు ఈ ఆఫర్ తీసుకొచ్చినట్టు DMI ఫైనాన్స్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మీరు కూడా పర్సనల్ లోన్ కోసం చూస్తున్నారా? ముందుగా మీ క్రెడిట్ స్కోరు ఎలా ఉందో చెక్ చేసుకోండి. మీరు గూగుల్ పే యూజర్ అయి ఉంటే వెంటనే ఈ పర్సనల్ లోన్ కోసం అప్లయ్ చేసుకోండి..

Read Also : Google Pay ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై Voiceతో డబ్బులు పంపుకోవచ్చు!