Reheat Foods : ఈ ఐదు ఆహారాలను మళ్లీ మళ్లీ వేడి చేయొద్దు…ఎందుకంటే?…

పుట్టగొడుగుల్ని సరిగా నిల్వచేయకున్నా, తిరిగి వేడిచేసినవి తిన్నా జీర్ణ వ్యవస్ధకు ఇబ్బంది కలుగుతుంది. అయితే పుట్టుగొడుగుల్ని ఫ్రిజ్ లో ఉంచిన 24 గంటల సమయంలోనే తిరిగి వేడి చేయవచ్చు.

Reheat Foods : ఈ ఐదు ఆహారాలను మళ్లీ మళ్లీ వేడి చేయొద్దు…ఎందుకంటే?…

Reheat Foods

Updated On : February 18, 2022 / 1:45 PM IST

Reheat Foods : ఉదయం వండిన ఆహారాలను మధ్యాహ్నం తినే సందర్భంలో చాలా మంది వాటిని తిరిగి వేడి చేస్తుంటారు. ఈ అలవాటు చాలా మంది ఇళ్లల్లో ఉంటుంది. ఎప్పుడు వండుకున్న ఆహారాన్ని అప్పుడే తినేసేయాలి కాని ఇలా మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తినటం ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల ఆనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు అధికంగా ఉంటాయని చెప్తున్నారు.

ముఖ్యంగా ఓ ఐదు పదార్ధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలిని సూచిస్తున్నారు. వీటిని వండిన తరువాత తిరిగి పదేపదే వేడిచేస్తే మాత్రం ఆరోగ్యానికి అనర్ధం జరుగుతాయని అంటున్నారు. ఇదే విషయం పరిశోధనల్లో సైతం తేలిందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆ ఆహారపదార్ధాల విషయానికి వస్తే….

కోడి మాంసం ; కోడి మాంసాన్ని ఉడికించే సమయంలో ముక్కలు బాగా ఉడికేలా జాగ్రత్తులు తీసుకోవాలి. సరిగా ఉడకుంటే ఇందులో ఇందులో ఉండే సాల్మొనెల్లా బ్యాక్టీరియా జీర్ణప్రక్రియపై ప్రభావం చూపుతుంది. చాలా మంది త్వరగా వంటకం పూర్తిచేయాలని చికెన్ ను మైక్రోవేవ్ లో ఉంచే ప్రయత్నం చేస్తారు. దీని వల్ల సరిగా ముక్క ఉడకదు. అలాగే చికెన్ ను ఒక సారి వండిన తరువాత దానిని వేడి వేడి గా తినాలన్న ఉద్దేశంతో తిరిగి వేడి చేసే అలవాటు చాలా మందిలో ఉంటుంది. ఇలా చేయటం ఏమాత్రం మంచిది కాదు. దీని వల్ల అందులో ఉండే ప్రొటీన్లు మన శరీరానికి అందకుండా పోతాయి.

అన్నం ; మనం రోజు వారిగా తీసుకునే పదార్ధాల్లో అన్నం ప్రధాన మైనది. అయితే ఉదయాన్నే అన్నం వండిన తరువాత దానిని తినే ముందు వేడి చేసుకోవటం చాలా మంది చేస్తుంటారు. ఇలా చేయటం ఏమాత్రం మంచిది కాదు. దీని వల్ల కొన్ని సందర్భాల్లో వాంతులు, విరేచనాలు, అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా హానికంలిగించే విషపదార్ధలు శరీరానికి హానికలిగిస్తాయి. అందుకే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వండుకోవటం మంచిది.

బంగాళదుంపలు ; ఉడికించిన బంగాళ దుంపలను గది ఉష్ణోగ్రతలో ఉంచటం వల్ల క్లోస్ట్రీడియమ్ బోటులినమ్ అనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దుంపల్ని తిరిగి వేడి చేసినా బ్యాక్టీరియా నాశనం కాదు. అందువల్ల బంగాళాదుంపని ఉడికించాక చల్లార్చి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి తప్ప బయటపెట్టొద్దు. తిరిగి వేడి చేయొద్దు.

పుట్టగొడుగులు ; పుట్టగొడుగుల్ని సరిగా నిల్వచేయకున్నా, తిరిగి వేడిచేసినవి తిన్నా జీర్ణ వ్యవస్ధకు ఇబ్బంది కలుగుతుంది. అయితే పుట్టుగొడుగుల్ని ఫ్రిజ్ లో ఉంచిన 24 గంటల సమయంలోనే తిరిగి వేడి చేయవచ్చు. ఆసమయం దాటిన తరువాత వేడి చేయటం వల్ల ఆరోగ్యానికి అనర్ధం తప్పదని గుర్తుంచుకోవాలి.

పాలకూర ; పాలకూరలో అధిక గాఢత కలిగిన నైట్రేట్ ఉంటుంది. దీనిని కూడా ఒకసారి వండిన తరువాత తిరిగి వేడి చేయకూడదు. ఎందుకంటే పాలకూరలో ఉండే కార్సినోజెనిక్ రక్తప్రసరణ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసే సామర్ధ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఇది తరువాత బేబీ బ్లూ సిండ్రోమ్ గా మారుతుంది. చిన్నపిల్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి పాలకూరను వండాక తిరిగి వేడి చేయటం మంచిది కాదు.