Cops : హెల్మెట్ పెట్టుకోలేదని ప్రశ్నించిన జర్నలిస్టుపై పోలీసుల దాడి

బైక్ మీద ప్రయాణిస్తు హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులకు ప్రశ్నించాడు ఓ జర్నలిస్టు.దీంతో పోలీసులు సదరు జర్నలిస్టుపై దాడి చేసిన నానా దుర్భాషలాడారు.

Assam Police Assault Journalist..asks Didn't Wear Helmets

Assam police Assault Journalist..Asks Didn’t Wear Helmets: ట్రాఫిక్ రూల్స్ అందరికి ఒకలానే ఉంటాయి. సామన్యులకు వేరుగా పోలీసులకు వేరుగా ఉండవు కదా..కానీ బైకర్స్ హెల్మెట్ పెట్టుకోవాలని రూల్స్ చెప్పే పోలీసులు ఆ రూల్స్ బ్రేక్ చేశారు. అదే విషయం ప్రశ్నించినందుకు ఓ జర్నలిస్టులో ఇద్దరు పోలీసులు ఏకంగా దాడి చేసిన ఘటన సోమవారం (ఫిబ్రవరి7,2022) అస్సాంలో జరిగింది.

చిరాంగ్ జిల్లాలో ఇద్ద‌రు పోలీసులు హెల్మెట్ ధ‌రించ‌కుండా బైక్‌పై దూసుకుపోతున్నారు. అది గమనించిన జయంత్ దేవ్ నాథ్ అనే ఓ జర్నలిస్టు ‘‘ హెల్మెట్ ధరించకుండా బైక్ పై ప్రయాణిస్తున్నారు…మీరు స‌మాజానికి ఇచ్చే సందేశం ఇదేనా? అని ఆ ఇద్దరు పోలీసులను ప్ర‌శ్నించాడు. దీంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తంచేస్తు..మమ్మల్నే ప్రశ్నిస్తావా? నీకెంత ధైర్యం? మేం పోలీసులమని తెలిసి కూడా మమ్మల్ని ప్రశ్నిస్తావా? మాకు తెలియదా? అంటూ అతనిపై దాడి చేశారు. దారుణంగా కొట్టారు. అసభ్యపదజాలంతో తిట్టారు. అక్కడితో ఆగకుండా మరింతగా రెచ్చిపోతూ..తోటి పోలీసులను పిలిపించి మరీ జర్నలిస్టు జయంత్ ను బలవంతంగా పోలీసులు జీపు ఎక్కించారు. నానా హంగామా చేశారు.

Also read : Cow Dung : పిడకలు చేయటం ఎలా?వాటి ఉపయోగాలేంటీ?..యూపీలో వర్శిటీ విద్యార్ధులకు ట్రైనింగ్

ఈ ఘ‌ట‌న‌పై పోలీసు ఉన్న‌తాధికారుల దృష్టికి వెళ్లటంతో సదరు ఇద్దరు పోలీసులను ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. విచార‌ణ అనంత‌రం ఇద్ద‌రు పోలీసుల‌పై త‌గు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చిరాంగ్ డీఎస్పీ లబా క్ర దేకా తెలిపారు.

దీనిపై బాధిత జర్నలిస్టు జయంత్ మాట్లాడుతూ..పోలీసులే ఇలా రూల్స్ అతిక్రమించటం ఎంత వరకు సరైంది? అని ప్రశ్నించినందుకు నన్ను తీవ్రంగా కొట్టారని వాపోయాడు. తాను ప్రశ్నించనందుకు పోలీసులకు అహం దెబ్బతిని నన్ను కొట్టారని,అస‌భ్య‌క‌ర‌మైన ప‌ద‌జాలంతో తిట్టారని..నేను జర్నలిస్టును..బాధ్యతగా ప్రశ్నించాను అని చెప్పానని. ఆ తరువాత వారు మరింతగా రెచ్చిపోయి నానా దుర్భషలు ఆడారని నాపై దాడి చేశార‌ని జ‌యంత్ తెలిపాడు. పోలీసుల దాడికి నేను షాక్ అయ్యానని తెలిపారు.

Also read : Baby Girl For Sale : 15 రోజుల ఆడ పసిగుడ్డును రూ. 80 వేలకు అమ్మేసిన తల్లిదండ్రులు..

అస్సాంలో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బాధ్యత గురించి చెప్పినందుకు నాపై దాడి చేసిన పోలీసులపై త్వరగా కఠిన చర్యలు తీసుకోవాలని జయంత్ డిమాండ్ చేశారు. లేదంటే నన్ను కాల్చి చంపేస్తారేమోనని ఆందోళన వ్యక్తంచేస్తు ఈ ఘటన అస్సాం ప్రభుత్వం గుర్తించాలని కోరారు.