Atiq Ahmed, Ashraf (File Photo)
Atiq Ahmed Killers: గ్యాగ్‌స్టర్, మాజీ ప్రజాప్రతినిధి అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ శనివారం రాత్రి ప్రయాగ్‌రాజ్‌లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో లవ్లేశ్ తివారీ, సన్నీసింగ్, అరుణ్ మౌర్యా అనే ముగ్గురు వ్యక్తులు గన్‌లతో ఇద్దరిని కాల్చేశారు. అనంతరం ఘటన స్థలం నుంచి పారిపోకుండా పోలీసులకు లొంగిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో సంచలనంగా మారింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. యూపీలో అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. పోలీసు అధికారులు హై అలర్ట్‌గా ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతలు కాపాడాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.
Atiq Ahmed : నిన్న కొడుకు నేడు తండ్రి.. గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హతం
అతీక్ అహ్మద్, అష్రఫ్‌లను హత్య కేసులో ముగ్గురు నిందితులది నేరపూరిత చరిత్రే. ముగ్గురిపై క్రిమినల్ రికార్డులు ఉన్నాయి. అయితే, వీరితో తమకు ఎలాంటి సంబంధం లేదని వారి కుటుంబ సభ్యులు చెప్పారు. గతంలో లవ్లేశ్ తివారీ జైలు పాలయ్యాడు. అతనితో కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని అతని తండ్రి యజ్ఞ తివారీ మీడియాకు చెప్పాడు. లవ్లేశ్ ఎప్పుడో ఒకసారి ఇంటికి వచ్చేవాడని, అతీక్ అహ్మద్ సోదరుల హత్య కేసులో లవ్లేశ్ ఉన్నాడని టీవీల్లో చూసి షాకయ్యామని అన్నాడు. అయితే, లవ్లేశ్ చేసిన చర్యలు మాకు తెలియవని, మా కుటుంబానికి అతనితో సంబంధం లేదని యజ్ఞ తివారీ అన్నాడు.
లవ్లేశ్ ఐదారు రోజలు క్రితం ఇక్కడి వచ్చాడని, మా కుటుంబం అతనితో మాట్లాడక సంవత్సరాలు అవుతుందని తెలిపాడు. లవ్లేశ్ పని చేయడు, డ్రగ్స్ బానిస అని యజ్ఞ తివారీ చెప్పాడు. మరో నిందితుడు సన్నీపై కూడా గతంలో 14 కేసులు నమోదయ్యాయి. అతను ఓ కేసులో పరారీలో ఉన్నాడు. సన్నీ తండ్రి మరణించాడు. తనకు చెందిన ఆస్తిలో వాటాను అమ్ముకొని ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతని సోదరుడు టీ స్టాల్ నడుపుకుంటున్నాడు. సన్నీ తల్లి అతని సోదరుడితో ఉంటుంది. అయితే, ఐదు సంవత్సరాలుగా సన్నీ తన కుటుంబాన్ని సందర్శించలేదని కటుుంబ సభ్యులు చెప్పారు.
Asaduddin Owaisi : అతిక్ అహ్మద్ సోదరుల హత్యలకు ప్రభుత్వమే కారణం : అసదుద్దీన్ ఒవైసీ
గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ సోదరుల హత్య కేసులో మరో నిందితుడు అరుణ్ మౌర్య. చిన్నతనంలోనే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 2010లో రైలులో ఒక పోలీసు హత్యకు సంబంధించి అరుణ్ పేరు వినిపించింది. ప్రస్తుతం అతను ఢిల్లీలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అయితే, అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్య అనంతరం పోలీసుల విచారణ నిందితులు కీలక విషయాలు వెల్లడించారు. మేము కరుడుగట్టిన నేరస్తులుగా మారాలని అనుకున్నామని, అందుకే వారిని హత్య చేశామని చెప్పారు. అయితే, పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.