బీజేపీ ఎంపీ కారుపై బాంబు దాడి

పశ్చిమబెంగాల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎంపీ కారుపై దాడి జరిగింది. బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు ముందు ఇటుకలతో దాడి చేశారు.

  • Published By: veegamteam ,Published On : December 15, 2019 / 03:31 AM IST
బీజేపీ ఎంపీ కారుపై బాంబు దాడి

Updated On : December 15, 2019 / 3:31 AM IST

పశ్చిమబెంగాల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎంపీ కారుపై దాడి జరిగింది. బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు ముందు ఇటుకలతో దాడి చేశారు.

పశ్చిమబెంగాల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎంపీ కారుపై దాడి జరిగింది. బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు ముందు ఇటుకలతో దాడి చేశారు. ఆ తర్వాత కారుకి సమీపంలో బాంబు విసిరారు. ఈ ఘటనలో బీజేపీ ఎంపీ సేఫ్ గా బయటపడ్డారు. అర్జున్ సింగ్ బరాక్ పూర్ ఎంపీగా ఉన్నారు.

ఏదో పని మీద కారులో వెళ్తుండగా.. ఎంపీ వాహనాన్ని కొందరు దుండగులు అడ్డగించారు. ఆ తర్వాత దాడికి పాల్పడ్డారు. దీనిపై బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ తీవ్రంగా స్పందించారు. అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన వారే తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం అన్నారు. వెంటనే వెస్ట్ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు.