Aquila Restaurant : చీర కట్టుకురావద్దన్న రెస్టారెంట్ మూతపడనుంది

ఢిల్లీలో చీరకట్టుకొని రెస్టారెంట్ కి వెళ్లిన మహిళను సిబ్బంది వెనక్కు పంపిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆమెకు జరిగిన అవమానాన్ని యావత్ దేశం ఖండించింది.

Aquila Restaurant : ఢిల్లీలో చీరకట్టుకొని రెస్టారెంట్ కి వెళ్లిన మహిళను సిబ్బంది వెనక్కు పంపిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆమెకు జరిగిన అవమానాన్ని యావత్ దేశం ఖండించింది. సాంప్రదాయంగా వస్తే ఎందుకు అనుమతించరని నెటిజన్లతోపాటు రెస్టారెంట్ సమీపంలోని వారు యాజమాన్యాన్ని కడిగిపడేశారు. మహిళను అవమానించిన ఆ హోటల్ పేరు గంటల వ్యవధిలో మారుమోగిపోయింది. దీంతో ఆ రెస్టారెంట్ పై అధికారులు ఓ కన్నేశారు.

Read More : Taliban : భారత్-అప్ఘానిస్తాన్ మధ్య విమాన సర్వీసులు..DGCAకి తాలిబన్ లేఖ

రెస్టారెంట్ ని తనిఖీ చేసి అన్ని పర్మిషన్లు ఉన్నాయో లేవో అని తనిఖీ చేశారు. రెస్టారెంట్ నడిపేందుకు కావలసిన అనుమతులు లేవని, హెల్త్ ట్రేడ్ లైసెన్స్ లైసెన్స్ తీసుకోలేదని అధికారులు గుర్తించారు. ‘అక్విలా అనే పేరుతో నడుస్తున్న ఈ రెస్టారెంట్ కు హెల్త్ ఇన్స్‌పెక్టర్ నోటీసులు పంపారు. మొదటిసారి నోటీసులకు ఎటువంటి స్పందన లేకపోవడంతో రెండవసారి జారీచేశారు. ఈ నోటీసులపై స్పందించినా, స్పందించకపైనా.. ఆ రెస్టారెంట్ మూతపడినట్లే అని అధికారులు చెబుతన్నారు.

Read More : Selfi Suicide : ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫీ వీడియో

ట్రెండింగ్ వార్తలు