Selfi Suicide : ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫీ వీడియో

కర్నూలు జిల్లాలో యువకుడు సెల్ఫీ సూసైడ్ కు పాల్పడ్డాడు. యువకుడు ఆత్మహత్య చేసుకుంటూ తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపింది. అధికారులు షాపును ఖాళీ చేయాలని వేధిస్తున్నారని పేర్కొన్నారు.

Selfi Suicide : ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫీ వీడియో

Suicide

Updated On : September 30, 2021 / 11:35 AM IST

Young man selfi suicide : కర్నూలు జిల్లాలో ఓ యువకుడు సెల్ఫీ సూసైడ్ కు పాల్పడ్డాడు. నగరంలో యువకుడు ఆత్మహత్య చేసుకుంటూ తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపింది. మున్సిపల్ అధికారులు షాపును ఖాళీ చేయాలని వేధిస్తున్నారని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు.

వివరాళ్లోకి వెళ్తే..పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ లో మున్సిపల్ ఓపెన్ థియేటర్ నందు 14 నెంబర్ షాపులో ఫారూఖ్ అనే యువకుడు చెప్పుల దుకాణం నడుపుకుంటున్నాడు. షాపును ఖాళీ చేయాలని మున్సిపల్ అధికారులు ఒత్తిళ్లు చేశారు. ఈ నేపథ్యంలో అప్పు తెచ్చి 10 లక్షల రూపాయలు మున్సిపల్ అధికారులకు చెల్లించానని ఫారూఖ్ తెలిపారు.

Cab Drivers : యువతిపై లైంగిక దాడికి యత్నించిన క్యాబ్ డ్రైవర్లు

వేరొకరి పేరుతో ఉన్న షాపును తన పేరుపై మార్చమని అధికారులను వేడుకున్నానని పేర్కొన్నారు. అయితే టెండర్లలో దక్కించుకోవాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను కలిసినా ఎవ్వరూ స్పందించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

షాపు ఇవ్వకపోతే అప్పు తెచ్చి చెల్లించిన రూ.10 లక్షలకు వడ్డీ కట్టలేను..అప్పులోళ్ళకు మొహం చూపించలేనంటూ ఆవేదన చెందాడు. అధికారులు న్యాయం చేయలేదు.. అందుకే సెల్ఫీ సూసైడ్ చేసుకుంటున్నా అంటూ సెల్ఫీ వీడియో తీశాడు.