Free Auto Ride: కొవిడ్ పేషెంట్లకు ఉచితంగా ఆటో రైడ్..

కొవిడ్ కేసులు పెరిగిపోతూ భయాందోళనలకు గురవుతుంటే.. రాంచీకి చెందిన ఈ ఆటో డ్రైవర్ మాత్రం కొవిడ్ పేషెంట్లకు మంచి ఆఫర్ ..

Free Auto Ride: కొవిడ్ పేషెంట్లకు ఉచితంగా ఆటో రైడ్..

Auto Driver In Ranchi Provides Free Rides To The Needy In The Midst Of Covid

Updated On : April 26, 2021 / 7:56 PM IST

Free Auto Ride: కొవిడ్ కేసులు పెరిగిపోతూ భయాందోళనలకు గురవుతుంటే.. రాంచీకి చెందిన ఈ ఆటో డ్రైవర్ మాత్రం కొవిడ్ పేషెంట్లకు మంచి ఆఫర్ ఇస్తున్నాడు. రవి అగర్వాల్ అనే ఈ వ్యక్తి కొవిడ్ కారణంగా మెడికల్ ఎమర్జెన్సీ కావాల్సిన వారికి ఉచిత సర్వీస్ అంటూ ప్రకటించాడు. ఇలా ఏప్రిల్ 15 నుంచి చేస్తున్నట్లు తెలిపాడు.

రాజేంద్ర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సైస్ కు ఓ మహిళను తీసుకువెళ్లాల్సి ఉంది. అంతా భయపడి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. ఆమె ఎంత డబ్బు ఇవ్వడానికైనా రెడీగా ఉంది. ఆమెను అడిగి ట్రామా సెంటర్ దగ్గర దింపేశాను.

తను కొవిడ్ పేషెంటో కాదో నాకు తెలీదు. కానీ, ఆమె నుంచి డబ్బులు తీసుకోలేదు. తిరిగి వస్తుంటే అప్పుడు రియలైజ్ అయ్యా. ఆమెకు కొవిడ్ ఉందేమోనని చాలా మంది ట్రాన్స్ పోర్ట్ ఇవ్వడానికి భయపడ్డారని. అంతా అయిపోలేదు. వీలైనంత వరకూ సాయం చేద్దామని అతను ముందుకెళ్తున్నాడు.