ఫైన్ భయంతో ట్రాఫిక్ పోలీస్ ని గుద్దేసి పారిపోయాడు
కొత్త మోటారు వాహనాల చట్టం 2019తో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన చట్టం చెమట్లు పట్టిస్తోంది. వాహనంతో రోడెక్కాలంటేనే

కొత్త మోటారు వాహనాల చట్టం 2019తో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన చట్టం చెమట్లు పట్టిస్తోంది. వాహనంతో రోడెక్కాలంటేనే
కొత్త మోటారు వాహనాల చట్టం 2019తో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన చట్టం చెమట్లు పట్టిస్తోంది. వాహనంతో రోడెక్కాలంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. ఇందుకు కారణం భారీగా పెంచేసిన ఫైన్లే. ట్రాఫిక్ పోలీసులు విధిస్తున్న జరిమానాలతో ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది. అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి ఉంది. వాహనం అమ్మినా అంత డబ్బు వచ్చేలా లేదని రైడర్లు వాపోతున్నారు. వేల వేలకు ఫైన్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ క్రమంలో జార్ఖండ్ రాజధాని రాంచీలో చిత్రమైన ఘటన చోటు చేసుకుంది. జరిమానాల భయంతో ఆందోళన చెందిన ఓ ఆటోడ్రైవర్ ఏకంగా ట్రాఫిక్ పోలీస్ ని గుద్దేసి ఆటోతో సహా పారిపోయాడు. ఈ ఘటనలో ట్రాఫిక్ పోలీస్ కి స్వల్పంగా గాయాలు అయ్యాయి.
ఆటో డ్రైవర్లు వారికి నిర్ణయించిన ప్రాంతం నుంచి కాకుండా మరో ప్రాంతం నుంచి ప్యాసింజర్లను ఎక్కించుకుంటే లక్ష రూపాయలు జరిమానా విధిస్తారు. కొత్త చట్టం వచ్చాక ఈ రూల్ ని మరింత స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. దీంటో ఆటో డ్రైవర్లకి భయం పట్టుకుంది. వివరాల్లోకి వెళితే.. రాంచీలో వెహికల్ చెకింగ్స్ జరుగుతున్నాయి. చుంటియా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ జాన్ ముర్ము ఆధ్వరంలో ఈ చెకింగ్స్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓవర్ స్పీడ్ తో వస్తున్న ఆటోని ఆపేందుకు ట్రాఫిక్ పోలీస్ ప్రయత్నించారు. ఇది గమనించిన ఆటో డ్రైవర్ మరింత స్పీడ్ పెంచాడు. ట్రాఫిక్ పోలీస్ ని గుద్దేశాడు. దీంతో ఆ పోలీసు కిందపడ్డాడు. ఆయన పక్కటెముకలు విరిగాయి. పలుచోట్ల గాయాలు అయ్యాయి.
చికిత్స నిమిత్తం ఆయనను ఆసుపత్రికి తరలించామని డీఎస్పీ అజిత్ కుమార్ విమల్ తెలిపారు. ఇది గమనించిన స్థానికులు ఆటోని ఆపే ప్రయత్నం చేశారు. ఆటో డ్రైవర్ మాత్రం తప్పించుకున్నాడు. ఆ ఘటనతో ట్రాఫిక్ పోలీసులు షాక్ తిన్నారు. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోయేవని ఆందోళన వ్యక్తం చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆటో డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు.
కొత్త మోటారు వాహనాల చట్టం వచ్చాక రాంచీలో వాహనదారులు, ట్రాఫిక్ పోలీసులు మధ్య గొడవలు పెరిగాయి. నిత్యం ఏదో ఒక చోట రోడ్డుపై వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ రేంజ్ లో చలాన్లు విధిస్తే ఎలా అని వాహనదారులు ఘర్షణకు దిగుతున్నారు. ఒక రాంచీలోనే కాదు.. యావత్ దేశంలోనూ ఇదే పరిస్థితి ఉది. కొత్త ట్రాఫిక్ చలాన్లతో దేశం గగ్గోలు పెడుతోంది. బండ్లు తీయాలంటేనే వణికిపోతున్నారు వాహనదారులు.