Petrol Price: పెట్రోల్ కంటే విమాన ఇంధనం ధరలే తక్కువ!

సామాన్యులు ఎక్కువగా వినియోగించే పెట్రోలు, డీజిల్ ధరలు కంటే విమానాలకు వినియోగించే ఇంధనం(ఎటీఎఫ్‌) చౌకగా ఉంది.

Petrol Price: విమానయానం ఎప్పుడూ ఖరీదైనదే.. సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే, తక్కువ సమయంలో గమ్యస్థానం చేరడానికి ఎగువ మధ్యతరగతి, సంపన్న ప్రజలు విమానయానం చేస్తారు తప్ప.. పేద, మధ్యతరగతి ప్రజలు విమానయానం చెయ్యడం అనేది దాదాపుగా జరగదు. అయితే, ఇంధన ధరలు చూస్తుంటే మాత్రం సామాన్యులకు అందుబాటులో ఉండాల్సిన పెట్రోల్ ధరలే విమాన ఇంధన ధరలు కంటే ఎక్కువగా ఉన్నాయి.

సామాన్యులు ఎక్కువగా వినియోగించే పెట్రోలు, డీజిల్ ధరలు కంటే విమానాలకు వినియోగించే ఇంధనం(ఎటీఎఫ్‌) చౌకగా ఉంది. పెట్రోల్‌, డీజెల్‌పై అధిక ఎక్సైజ్‌ డ్యూటీ విధించడమే కారణం. ఎటీఎప్‌ కిలో లీటరు(1000 లీటర్ల) ధర గరిష్ఠంగా రూ.83వేలు అంటే, లీటరు రూ. 83.. దేశంలో వివిధ ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ. 110గా ఉంది. అంటే, దాదాపు 27రూపాయలు ఎక్కువగా ఉంది.

కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచడం.. విమానాలకు వినియోగంచే ఇంధనంపై సుంకం కాస్త తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను చమురు విక్రయ సంస్థలు పెంచుకుంటూ పోతున్నాయి. మిగతా దేశాల్లో కంటే, మనదేశంలోనే పెట్రోల్ ధరలను ఎక్కువగా పెంచుతున్నారు. ఎటీఎఫ్ అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం ఉండడంతో నియంత్రణలో ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు ప్రయాణీకులపై ఛార్జీల భారం పెంచుతుంది. నిత్యావసర వస్తువుల ధరలను ప్రభావితం చేస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ప్రతీ రంగంలో ప్రభావం పడుతుంది.

ట్రెండింగ్ వార్తలు