అయోధ్య కమిటీకి గడువు పొడిగించిన సుప్రీం

అయోధ్య భూవివాదం కేసులో స్నేహపూర్వక పరిష్కారం కనుగొనేందుకు తమకు ఇంకా సమయం కావాలని  ఇవాళ (మే-10,2019) విచారణ సందర్భంగా  ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ కమిటీ సుప్రీంకోర్టుకి తెలిపింది. దీంతో ఆగస్టు-15, 2019 వరకు మధ్యవర్తిత్వ కమిటీకి సుప్రీం సమయాన్ని పొడిగించింది. ఇప్పటివరకు జరిగిన ప్రోగ్రెస్ గురించి తాము చెప్పబోమని, అది రహస్యమని సీజేఐ రంజన్ గొగొయ్ తెలిపారు. గురువారం సీల్డ్ కవర్ లో కమిటీ తన రిపోర్ట్ ను కోర్టుకి సమర్పించిన విషయం తెలిసిందే.
Also Read : మోడీకి పోటీ లేదు : మాజీ జవాన్ పిటిషన్ తిరస్కరణ

అయోధ్య భూవివాదంలో శాశ్వత పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కూడిన మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేస్తూ మార్చి-8,2019న సుప్రీం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. శ్రీశ్రీ రవిశంకర్, జస్టిస్ ఎఫ్ఎమ్ఐ ఖలిఫుల్లా, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచులు ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీకి చైర్ పర్శన్ గా జస్టిస్ ఎఫ్ఎమ్ఐ ఖలిఫుల్లా వ్యవహరించనున్నారు.

నాలుగు వారాల్లోగా కమిటీ స్టేటస్ రిపోర్ట్ పూర్తి అవ్వాలని,ఎనిమిది వారాల్లోగా ప్రొసీడింగ్స్ పూర్తి అవ్వాలని అప్పట్లో సుప్రీం ఆదేశించిన విషయం తెలిసిందే.అయితే సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించేందుకు తమకు ఇంకా సమయం కావాలని కమిటీ శుక్రవారం(మే-10,2019) కోరడంతో సుప్రీం దానికి అంగీకరించింది.
Also Read : మిసైల్ టెస్ట్ లతో ట్రంప్ కు కోపం తెప్పిస్తున్న కిమ్

ట్రెండింగ్ వార్తలు