మిసైల్ టెస్ట్ లతో ట్రంప్ కు కోపం తెప్పిస్తున్న కిమ్

వారం రోజుల వ్యవధిలో రెండోసారి మిసైల్ టెస్ట్ నిర్వహించింది ఉత్తరకొరియా. స్థానిక కాలమానం ప్రకారం కుసోంగ్ సిటీ నుంచి ఈ మిసైల్స్ టెస్ట్ ను ఉత్తరకొరియా నిర్వహించింది.

  • Published By: venkaiahnaidu ,Published On : May 10, 2019 / 04:39 AM IST
మిసైల్ టెస్ట్ లతో  ట్రంప్ కు కోపం తెప్పిస్తున్న కిమ్

వారం రోజుల వ్యవధిలో రెండోసారి మిసైల్ టెస్ట్ నిర్వహించింది ఉత్తరకొరియా. స్థానిక కాలమానం ప్రకారం కుసోంగ్ సిటీ నుంచి ఈ మిసైల్స్ టెస్ట్ ను ఉత్తరకొరియా నిర్వహించింది.

వారం రోజుల వ్యవధిలో రెండోసారి మిసైల్ టెస్ట్ నిర్వహించింది ఉత్తరకొరియా. స్థానిక కాలమానం ప్రకారం గురువారం (మే-9,2019) మధ్యాహ్నం కుసోంగ్ సిటీ నుంచి  ఈ మిసైల్స్ టెస్ట్ ను ఉత్తరకొరియా నిర్వహించింది. భూభాగం మీదుగా ఒక క్షిపణి దాదాపు 420 కిలోమీటర్లు (260 మైళ్లు), మరో క్షిపణి 270 కిలోమీటర్లు తూర్పు వైపునకు దూసుకెళ్లాయని తెలిసింది.

న్యూక్లియర్ చర్చలను ఏ విధంగా పునరుద్దరించాలనే దానిపై అమెరికాకు చెందిన దౌత్యవేత్త దక్షిణ కొరియా చేరుకున్న సమయంలో కిమ్ ఈ పరీక్షలు నిర్వహించాడు. ఉత్తర కొరియా మిసైల్స్ టెస్ట్ పై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్… అధికారులు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా చూస్తున్నట్లు చెప్పారు.
Also Read : షాకింగ్ రిప్లైతో స్మృతీ ముఖం వాడిపోయింది

చర్చలు జరపాలని ఉత్తర కొరియా అనుకుంటున్నట్లు తనకు తెలుసని,కానీ వాళ్లు చర్చలకు సిద్దంగా ఉన్నారని తాను అనుకోవట్లేదని ట్రంప్ అన్నారు.ఏం జరుగుతుందో చూస్తామని,ఉత్తరకొరియా మిసైల్స్ టెస్ట్ ల వల్ల ఎవ్వరూ సంతోషంగా లేరని ట్రంప్ అన్నారు.

న్యూక్లియర్ ప్రోగ్రామ్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ల మధ్య సింగపూర్ లో ఒకసారి, వియత్నాం రాజధాని హనోయ్ లో ఒకసారి చర్చలు జరిగాయి. అయితే ఎటువంటి ఒప్పందం లేకుండానే ఈ చర్చలు ముగిశాయి. అణ్వాయుధ పరీక్షలు మానుకోవాలంటే తమ దేశంపై విధించిన ఆంక్షలను తొలగించాలని ఉత్తర కొరియా డిమాండ్ చేసినందుకే చర్చలు విఫలమైనట్లు ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే.
Also Read : మోడీకి మమత బంపరాఫర్: ఆరోపణలు నిరూపించలేకపోతే 100 గుంజీలు తియ్యాలి