మోడీకి పోటీ లేదు : మాజీ జవాన్ పిటిషన్ తిరస్కరణ

  • Published By: venkaiahnaidu ,Published On : May 10, 2019 / 03:03 AM IST
మోడీకి పోటీ లేదు : మాజీ జవాన్ పిటిషన్ తిరస్కరణ

వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను వేసిన నామినేషన్‌ ను ఎలక్షన్ కమిషన్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మాజీ బీఎస్ఎఫ్ జవాను తేజ్‌ బహదూర్‌ యాదవ్ వేసిన పిటిషన్‌ ను గురువారం (మే-9,2019) సుప్రీంకోర్టు తిరస్కరించింది. పిటిషన్‌ ను స్వీకరించడానికి సరైన కారణాలు కనపడలేదని సీజేఐ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. 
Also Read : భారతదేశపు డివైడర్…మోడీపై టైమ్స్ వివాదాస్పద హెడ్ లైన్

 2017లో బీఎస్‌ఎఫ్‌ జవానుగా విధులు నిర్వహించిన తేజ్‌ బహదూర్‌ ఆ సమయంలో జవాన్లకు సప్లై చేస్తున్న ఫుడ్ క్వాలిటీ గురించి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. దీంతో ఆయన్ను విధుల నుంచి తొలగించారు. ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ వారణాశి స్థానానికి అభ్యర్థిగా తేజ్ బహదూర్ ని ప్రకటించింది.

అయితే ఆయన వేసిన నామినేషన్‌ తిరస్కరణకు గురి కావడంతో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. వారణాశి నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రధాని మోడీ బరిలో ఉన్న విషయం తెలిసిందే.