భారతదేశపు డివైడర్…మోడీపై టైమ్స్ వివాదాస్పద హెడ్ లైన్

  • Published By: venkaiahnaidu ,Published On : May 10, 2019 / 06:03 AM IST
భారతదేశపు డివైడర్…మోడీపై టైమ్స్ వివాదాస్పద హెడ్ లైన్

వివాదాస్పద హైడ్ లైన్ తో అమెరికాకు చెందిన న్యూస్ మ్యాగజైన్ “టైమ్”వ్యంగ్యంగా ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫొటోను కవర్ పేజీపై ప్రచురించింది.మే-20,2019న విడుదల అయ్యే ఈ మ్యాగజైన్ ప్రస్థుతం దేశం లో ఎన్నికలు జరుగుతన్న సమయంలో వివాదాలు సృష్టించేదిగా ఉంది. కవర్ పేజీపై వ్యంగ్యంగా ఉన్న మోడీ ఫొటో పక్కన భారతదేశాన్ని విభజించేవాడు అనే హెడ్ లైన్ ఉంది.మ్యాగజైన్ లోని ఆర్టికల్ కు సంబంధించిన టైటిల్ గా ఇది ఉంది.
Also Read : మోడీకి మమత బంపరాఫర్: ఆరోపణలు నిరూపించలేకపోతే 100 గుంజీలు తియ్యాలి

ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్యం మరో ఐదేళ్లు మోడీ ప్రభుత్వాన్ని భరించగలదా అన్న హెడ్ లైన్ తో ఈ ఆర్టికల్ ను అతిష్ తఫీర్ రాశారు.నెహ్రూ,మోడీకి మధ్య వ్యత్యాసం గురించి కూడా ఈ ఆర్టికల్ లో ఉంది. మోడీ హయాంలో హిందూ-ముస్లిం సంబంధాలు, మోడీని తిట్టడం ద్వారా హిందూ అనుకూలమైన వ్యక్తులుగా నిరూపించుకోవడం వంటి ఆధారంగా ఈ ఆర్టికల్ రాయబడింది.

గుజరాత్ అల్లర్లను కూడా ఈ ఆర్టికల్ లో గుర్తు చేశారు. అయితే మోడీ గురించి టైమ్స్ మ్యాగజైన్ ఈ విధంగా తీవ్రమైన కామెంట్రీతో రాయడం ఇదే మొదటిసారి కాదు.2012లో మోడీని వివాదాస్పదమైన,ఆశాభావం కలిగిన,తెలివైన రాజకీయనాయకుడిగా టైమ్స్ తన మ్యాగజైన్ లో ఓ ఆర్టికల్ ను పబ్లిష్ చేసింది