Ram Mandir
Ram Mandir : అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం గత నెల అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రపంచ దేశాల నుంచి తరలివచ్చారు. ఈ కార్యక్రమం జనవరి 22న జరగ్గా.. జనవరి 23 నుంచి సాధారణ భక్తులను బాలరాముడిని దర్శించుకునేందుకు అనుమతిచ్చారు. ఆరోజు నుంచి నేటి వరకు 24లక్షల మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకున్నారు.
Also Read : Anand Mahindra : మీరు ఇలా తయారు చేయగలా? నేను పెట్టుబడి పెడతా..! ఆనంద్ మహీంద్ర ట్వీట్.. వీడియో వైరల్
జనవరి 22న జరిగిన రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమం తరువాత గడిచిన 11 రోజుల్లో దాదాపు 25లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించగా.. భక్తుల నుంచి కానుకలు రూపంలో రూ. 11కోట్లు దాటాయని ఆలయ ట్రస్టు కార్యాలయ ఇన్ ఛార్జి గుప్తా తెలిపారు. గత 11 రోజుల్లో సుమారు రూ. 8కోట్లు హుండీల్లో జమకాగా, చెక్కులు, ఆన్ లైన్ ద్వారా వచ్చిన మొత్తం రూ. 3.50కోట్లు ఉంటుందని తెలిపారు. ఆలయ గర్భగుడి ముందు దర్శన మార్గం వద్ద నాలుగు హుండీలను ఏర్పాటు చేశామని, అందులో భక్తులు విరాళాలు అందజేశారని ప్రకాష్ గుప్తా చెప్పారు.
Also Read : Ayodhya : రామ మందిర గర్భగుడిలో ప్రవేశించిన వానరం.. హనుమంతుడే వచ్చాడంటూ.. ఆలయ ట్రస్ట్ ట్వీట్
భక్తుల నుంచి వచ్చిన విరాళాలను లెక్కించేందుకు ఆలయ ట్రస్టు ఉద్యోగులను నియమించామని, సాయంత్రం సమయంలో భక్తుల నుంచి వచ్చిన విరాళాల మొత్తాన్ని ఏరోజుకారోజు ట్రస్టు కార్యాలయంలో సమర్పించడం జరుగుతుందని తెలిపారు. 11 మంది బ్యాంకు ఉద్యోగులు, ఆలయ ట్రస్ట్ కు చెందిన ముగ్గురితో కూడిన 14 మంది బృందం ఈ నాలుగు హుండీల్లో విరాళాలను లెక్కిస్తున్నారని, లెక్కింపు ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణ జరుగుతుందని ఆలయ ట్రస్టు కార్యాలయ ఇన్ ఛార్జి ప్రకాశ్ గుప్తా చెప్పారు.