Bihar Panchayat Polls : గేదెపై వచ్చి నామినేషన్..ఎందుకో తెలుసా

బీహార్ లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓ అభ్యర్థి ఊరేగింపుగా గేదెపై వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశాడు.

Bihar Panchayat Polls బీహార్ లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓ అభ్యర్థి ఊరేగింపుగా గేదెపై వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశాడు.పెరుగుతున్న పెట్రోల్‌,డీజిల్ ధరలపై ఈ రకంగా తన నిరసనను అతను వినూత్న రీతిలో ప్రదర్శించాడు.

కఠియార్‌ జిల్లా హసన్‌గంజ్‌ పంచాయతీలోని రామ్‌పూర్‌ గ్రామస్తుడు మహ్మద్‌ ఆజాద్‌ ఆలం ఓ పాడి రైతు. అయితే ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన ఆజాద్‌ ఆలం సోమవారం నామినేషన్‌ వేసేందుకు గేదెపై వెళ్లాడు.

అలా ఎందుకు వెళ్లాడని ఆరా తీస్తే..  పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు నేను భరించలేకపోతున్నా. నేను పాడి రైతును. నేను గేదెపై మాత్రమే ప్రయాణించగలను అని ఆలం మీడియాకు తెలిపాడు. ఇక పోటీ చేస్తున్న రామ్‌పూర్‌ స్థానం నుంచి గెలిస్తే తాను వైద్య రంగంపై దృష్టి సారిస్తానని ఆలం చెప్పాడు. కాగా బీహార్ లో 11 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్‌ 12న చివరి దశ జరగనుంది.

READ Bihar : నితీష్ మాస్టర్ స్కెచ్..పంచాయత్ పోల్స్ సమయంలో 20వేల కోట్ల సోలార్ స్కీమ్

ట్రెండింగ్ వార్తలు