కరోనాకు మందు కనిపెట్టాం.. 100శాతం రికవరీ రేటు: బాబా రామ్‌దేవ్

  • Publish Date - June 11, 2020 / 02:34 AM IST

ప్రపంచవ్యాప్తంగా జీవితాలను ప్రభావితం చేస్తున్న కరోనావైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ వ్యాధికి వ్యాధి నుంచి కోలుకునేందుకు మందు తన దగ్గర ఉన్నట్లుగా యోగా గురువు, పతంజలి వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్ ప్రకటించారు. ప్రాణాంతక కోవిడ్-19 వ్యాధికి సమాధానం తన వద్ద ఉందని గిలోయ్ మరియు అశ్వగంధతో చికిత్స ఆ వ్యాధికి చికిత్స చేయవచ్చునని ఆయన ప్రకటించారు. 

రామ్‌దేవ్ బాబా ప్రకారం.. కరోనా మన శరీరంలోకి చొచ్చుకుపోయి మొత్తం కణాలు మరియు వ్యవస్థను భంగపరుస్తుంది మరియు బహుళం అవుతూ ఉంటుంది. అవి శరీరంలోని ఇతర కణాలకు సోకుతుంది. అశ్వగంధ మరియు గిలోయ్ ఆ శరీరం లోపల సంక్రమణ గొలుసు(Virus Chain)ను విచ్ఛిన్నం చేయడంలో 100 శాతం ప్రభావితం చేస్తుంది.

కోవిడ్-19 రోగులపై గిలోయ్, అశ్వగంధ పరీక్షలు ఇప్పటికే జరిగాయని రామ్‌దేవ్ వెల్లడించారు. ఇది 100 శాతం రికవరీ రేటును కలిగి ఉంటుందని, రోగులకు గిలోయ్, అశ్వగంధ, తులశివతి ఖాళీ కడుపుతోనూ.. తినడం తరువాత ఇచ్చామని, ఫలితంగా 100 శాతం రికవరీ రేటు మరియు 0 శాతం మరణ రేటు ఉందని, అయితే, ప్రస్తుతం క్లినికల్ కంట్రోల్ ట్రయల్ జరుగుతోందని ఆయన వెల్లడించారు. అతి త్వరలో కరోనాను ఎలా ఓడించగలమో స్పష్టంగా తెలుస్తుంది. పతంజలి పరిశోధన పూర్తయిందని, శాస్త్రీయ పత్రాలను దేశం మొత్తం ముందు ఉంచుతామని కూడా ఆయన అన్నారు. 

మరోవైపు, జపాన్‌లోని AIST సహకారంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటి) ఢిల్లీ శాస్త్రవేత్తల బృందం, అశ్వగంధకు COVID-19 తో పోరాటం చేయగల సామర్థ్యం ఉందని కనుగొన్నారు.

Read: శబరిమల ఆలయంలో పూజలు ఎప్పటినుంచి ప్రారంభమంటే!

ట్రెండింగ్ వార్తలు