Uddhav Sena: ములాయంకు పద్మ అవార్డు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఉద్ధవ్ సేన.. బాల్ థాకరే, సావర్కర్‭లకు మరిచారంటూ ఆగ్రహం

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌కు పద్మవిభూషణ్ అవార్డు రావడం పట్ల శివసేన కొంత ఆశ్చర్యాన్ని, కొంత విముఖతను వ్యక్తం చేసింది. సమాజ్‌వాదీ నాయకుడు గౌరవనీయమైన రాజకీయ నాయకుడని, అయితే అయోధ్య నిరసనల సందర్భంగా కరసేవకులపై కాల్పులు జరిపినందుకు బీజేపీ విమర్శించేదని గుర్తు చేసింది

Uddhav Sena: శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే, సావర్కర్‌లకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ అవార్డు ఇవ్వకపోవడంపై శివసేన (ఉద్ధవ్ వర్గం) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వారిని పూర్తిగా విస్మరించిందని తప్పు పట్టింది. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25న దేశంలోని 106 మందికి పద్మ అవార్డులను ప్రదానం చేశారు.

Pakistan Sports Minister: మూడు నెలల్లో ఎన్నికలు.. పంజాబ్ క్రీడా మంత్రిగా పాకిస్థాన్ క్రికెటర్ నియామకం ..

ఈ విషయమై తాజాగా సామ్నా ద్వారా ఉద్ధవ్ స్పందిస్తూ “నిర్మాణాన్ని కూల్చివేసేందుకు తమ మనుషులు కారణమైతే, వారి గురించి గర్వపడతానని చెప్పిన నాయకుడిని బీజేపీ మళ్లీ మరచిపోయింది” అని అన్నారు. అంటే, బాబ్రీ మసీదు కూల్చివేతపై బాల్ థాకరే చేసిన వ్యాఖ్యలను సామ్నా ఈ విధంగా గుర్తు చేసింది. ఇక గతంలో అయితే బాల్ థాకరేకు భారతరత్న ఇవ్వాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. బాలాసాహెబ్ ఒక్కడే “హిందూ హృదయ సామ్రాట్” అని రౌత్ అన్నారు.

Amit Shah: వీధి గోడలపై కమలం బొమ్మలు గీసిన కేంద్రమంత్రి అమిత్ షా

ఈ విషయం పక్కన పెడితే సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌కు పద్మవిభూషణ్ అవార్డు రావడం పట్ల శివసేన కొంత ఆశ్చర్యాన్ని, కొంత విముఖతను వ్యక్తం చేసింది. సమాజ్‌వాదీ నాయకుడు గౌరవనీయమైన రాజకీయ నాయకుడని, అయితే అయోధ్య నిరసనల సందర్భంగా కరసేవకులపై కాల్పులు జరిపినందుకు బీజేపీ విమర్శించేదని గుర్తు చేసింది. ఈ ఘటన తర్వాత బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఆయన్ను మౌలానా ములాయం అని పిలవడం ప్రారంభించాయని పేర్కొంది. ‘‘కాల్పులు జరగకపోతే, కోపంతో ఉన్న హిందువులు వీధుల్లోకి వచ్చేవారు కాదు, ఉత్తరాదిలో బీజేపీకి రాజకీయ ప్రయోజనం లభించేది కాదు” అని శివసేన పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు