Pakistan Sports Minister: మూడు నెలల్లో ఎన్నికలు.. పంజాబ్ క్రీడా మంత్రిగా పాకిస్థాన్ క్రికెటర్ నియామకం ..

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్ పంజాబ్ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిగా నియామకం అయ్యారు. ప్రస్తుతం అతను బంగ్లాదేశ్ ప్రిమియర్ లీగ్‌లో బిజీగా ఉన్నాడు. ఉన్నట్లుండి రియాజ్‌ మంత్రి పదవికి ఎంపిక కావటంతో వెంటనే స్వదేశానికి రావాలని ప్రభుత్వం ఆదేశాలు వెళ్లాయి. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో తాత్కాలిక క్రీడా మంత్రిగా త్వరలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నాడు.

Pakistan Sports Minister: మూడు నెలల్లో ఎన్నికలు.. పంజాబ్ క్రీడా మంత్రిగా పాకిస్థాన్ క్రికెటర్ నియామకం ..

Pakistan Sports Minister

Pakistan Sports Minister: పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్ పంజాబ్ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిగా నియామకం అయ్యారు. ప్రస్తుతం అతను బంగ్లాదేశ్ ప్రిమియర్ లీగ్‌లో బిజీగా ఉన్నాడు. ఉన్నట్లుండి రియాజ్‌కు మంత్రి పదవి రావటం, వెంటనే స్వదేశానికి రావాలని ప్రభుత్వం ఆదేశాలు వెళ్లాయి. ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. వహాబ్ రియాజ్ స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో తాత్కాలిక క్రీడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ఈ విషయాన్ని పంజాబ్ తాత్కాలిక ముఖ్యమంత్రి మొహ్సిన్ నఖ్వీ ధృవీకరించారు. అయితే, పంజాబ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి సలహా మేరకు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మిత్రపక్షం ఈ నెలలో స్థానిక శాసనసభను రద్దు చేసింది. మరో మూడు, నాలుగు నెలల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు ఆయన ఈ పదవిలో ఉండే అవకాశం ఉంది.

Pakistan Disease 18 Died : పాకిస్తాన్ లో అంతు చిక్కని వ్యాధితో 18 మంది మృతి

పంజాబ్ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిగా వహాబ్ రియాజ్ ను నియమించడం పట్ల కొందరు రాజకీయ నిపుణులు తప్పుబడుతున్నారు. 37ఏళ్ల వహాబ్ రియాజ్‌ అంతర్జాతీయ క్రికెట్ కు చాలాకాలంగా దూరంగా ఉంటున్నాడు. అతను చివరిసారిగా 2020 డిసెంబర్‌లో పాకిస్థాన్ తరపున ఆడాడు. టీ20 ప్రపంచ కప్ -2022 గ్రూప్ దశలో పాకిస్థాన్ ఓటమిపాలైన సమయంలో అప్పటి చీఫ్ సెలెక్టర్ వసీమ్‌ను లక్ష్యంగా చేసుకున్న పాక్ క్రికెటర్లలో రియాజ్ కూడా ఒకరు.

Pakistan Economic Crisis : పాకిస్తాన్ మరో శ్రీలంక కానుందా? రోజురోజుకు దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితి

వహాబ్ రియాజ్ పాకిస్థాన్ లెఫ్ట్‌ఆర్మ్ బౌలర్. 2008లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగ్రేటం చేశాడు. 91 వన్డేలు ఆడిన రియాజ్ 120 వికెట్లు పడగొట్టాడు. 27 టెస్టుల్లో 83 వికెట్లు తీశాడు. ఇక టీ20 ఫార్మాట్‌లో 36 మ్యాచ్ లు ఆడి 38 వికెట్లు తీశాడు. 2020 తరువాత పాకిస్థాన్ జట్టులో చోటు కోల్పోయిన రియాజ్.. టీ20 లీగ్స్‌లో బిజీగా ఉన్నాడు.