Pakistan Economic Crisis : పాకిస్తాన్ మరో శ్రీలంక కానుందా? రోజురోజుకు దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితి

పాకిస్తాన్ ఆర్థికంగా దివాళా తీస్తుందా? పాక్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడం దేనికి సంకేతం. దాయాది మరో శ్రీలంకలా మారనుందా? అంటే, అవుననే సంకేతావు వెలువడుతున్నాయి. అమెరికా డాలర్ తో పోలిస్తే పాకిస్తాన్ కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో పడిపోవటం ఇందుకు ఉదాహరణ అంటున్నారు నిపుణులు.

Pakistan Economic Crisis : పాకిస్తాన్ మరో శ్రీలంక కానుందా? రోజురోజుకు దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితి

Pakistan Economic Crisis : పాకిస్తాన్ ఆర్థికంగా దివాళా తీస్తుందా? పాక్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడం దేనికి సంకేతం. దాయాది మరో శ్రీలంకలా మారనుందా? అంటే, అవుననే సంకేతావు వెలువడుతున్నాయి. అమెరికా డాలర్ తో పోలిస్తే పాకిస్తాన్ కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో పడిపోవటం ఇందుకు ఉదాహరణ అంటున్నారు నిపుణులు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒక్కరోజులోనే 24 రూపాయలు పడిపోయింది. ప్రస్తుతం అమెరికా డాలర్ తో పోల్చితే పాకిస్తాన్ కరెన్సీ విలువ 255 రూపాయలకు చేరింది. దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Also Read..Hindenburg Report On ADANI Group : షేర్ మార్కెట్‌ని షేక్ చేసిన హిండెన్‌బర్గ్ రిపోర్ట్..చట్టపరమైన చర్యలు తీసుకునే యోచనలో అదానీ గ్రూప్

ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో దారుణ పరిస్థితులను ఈ మధ్యనే కళ్లారా చూశాం. ఇప్పుడు అదే లిస్ట్ లో పాకిస్తాన్ కూడా చేరింది. దాయాది దేశంలో అన్నీ సమస్యలే ఉన్నాయి. తినే తిండి దగ్గర నుంచి నిత్యవసరాలు, విద్యుత్, పెట్రోల్, డీజిల్ అన్నింటి ధరలు సామాన్యులకు అందుబాటులో లేని పరిస్థితి. దీంతో పాకిస్తాన్ ప్రజలు విలవిలలాడుతున్నారు. మరోసారి ఐఎంఎఫ్ సాయం కోసం వేయి కళ్లతో ఆ దేశ ప్రభుత్వం ఎదురుచూస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా గ్యాస్ ఛార్జీలు, పాక్ రూపాయి మారక విలువను నిర్ణయించాలని ఐఎంఎఫ్ కండీషన్ పెట్టింది. ఈ నిబంధనలకు పాకిస్తాన్ ఓకే చెప్పడంతో ఒక్కసారిగా ఆ దేశ కరెన్సీ విలువ పడిపోయింది. ఇటు పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ కూడా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వడ్డీ రేట్లను 24 సంవత్సరాల గరిష్ట స్థాయికి పెంచింది.

Also Read..Gold price : పసిడి ధరకు రెక్కలు..10 గ్రాముల బంగారం ధర రూ. 57,490..రూ. 60వేలు దాటుతుందంటున్న నిపుణులు

పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేవు. చాలా కాలంగా జీతాలు ఇవ్వకుండా నెట్టుకొస్తోంది. ఓవైపు నిత్యవసర ధరలు, మరోవైపు కరెంటు కోత, ఖజానాలో విదేశీ మారక నిల్వలు అడుగంటడంతో దాయాది దేశం విలవిలలాడుతోంది. తరుచుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాకిస్తాన్ అంధకారంలో మునిగిపోతోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.