Hindenburg Report On ADANI Group : షేర్ మార్కెట్‌ని షేక్ చేసిన హిండెన్‌బర్గ్ రిపోర్ట్..చట్టపరమైన చర్యలు తీసుకునే యోచనలో అదానీ గ్రూప్

హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో అదానీ గ్రూప్ కు జరగాల్సిన నష్టం కాస్తా ఎప్పుడో జరిగిపోయింది. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల షేర్లు ఒకటిన్నర నుంచి 9 శాతం మేర నష్టపోయాయ్. దీంతో.. హిండెన్‌బర్గ్ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తోంది అదానీ గ్రూప్. కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా.. భారతీయ, అమెరికా చట్టాలకు లోబడి ఉన్న నిబంధనలను పరిశీలిస్తున్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది.

Hindenburg Report On ADANI Group : షేర్ మార్కెట్‌ని షేక్ చేసిన హిండెన్‌బర్గ్ రిపోర్ట్..చట్టపరమైన చర్యలు తీసుకునే యోచనలో అదానీ గ్రూప్

Hindenburg Report On ADANI Group : ఒక్క రిపోర్ట్.. ఒకే ఒక్క రిపోర్ట్.. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల పునాదులను కదిలించింది. ఒక్క రోజులోనే.. 87 వేల కోట్ల సంపద ఆవిరయ్యేలా చేసింది. ఆ ఒక్క రిపోర్ట్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీని.. మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి దిగజార్చేసింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిలీజ్ చేసిన రిపోర్ట్.. మార్కెట్‌లో పెద్ద దుమారమే రేపిందని చెప్పాలి. అయినప్పటికీ.. అదానీ గ్రూప్ మాత్రం.. తమపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. కుట్ర, దురుద్దేశాలతోనే.. రిపోర్ట్ నిండి ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. హిండెన్‌బర్గ్ రిపోర్టులో ఆరోపణల సంగతి ఎలా ఉన్నా.. అదానీ గ్రూప్ FPOలో మాత్రం దుమ్మురేపింది. అదానీ గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ సహా 33 సంస్థాగత పెట్టుబడుల నుంచి.. 5 వేల 9 వందల కోట్ల నిధులను సమీకరించింది.

ADANI ..Hindenburg Report : అదానీ గ్రూప్ కంపెనీల పునాదుల్ని షేక్ చేసిన ‘ఒక్క రిపోర్ట్’‌.. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్ చెప్పిందేంటి..?

అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలు.. అప్పుల కుప్పగా మారాయంటూ.. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్‌పై.. అదానీ గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కనీసం.. తమ వివరణ కూడా కోరకుండా.. రిపోర్టును రూపొందించడంపై మండిపడుతోంది. దేశంలోని అత్యున్నత న్యాయస్థానాల్లో వీగిపోయిన ఆరోపణలను పట్టుకొని.. రిపోర్ట్ తయారుచేశారని విమర్శించింది. అదానీ గ్రూప్ వివరణ ఎలా ఉన్నా.. హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌లో జరగాల్సిన నష్టం కాస్తా ఎప్పుడో జరిగిపోయింది. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల షేర్లు ఒకటిన్నర నుంచి 9 శాతం మేర నష్టపోయాయ్. దీంతో.. హిండెన్‌బర్గ్ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తోంది అదానీ గ్రూప్. కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా.. భారతీయ, అమెరికా చట్టాలకు లోబడి ఉన్న నిబంధనలను పరిశీలిస్తున్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది.

Gangavaram Port : అదానీ గ్రూప్‌ ఆధీనంలోకి గంగవరం పోర్టు

హిండెన్‌బర్గ్ రిపోర్ట్.. అదానీ గ్రూప్ ఇన్వెస్టర్లు, షేర్‌హోల్డర్లను మాత్రమే కాదు అదానీ గ్రూప్‌ ఆఫ్ కంపెనీలను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. దేశంలోని స్టాక్ మార్కెట్లలో కూడా అనిశ్చితికి దారితీస్తుందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయ్. ఇప్పటికే.. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత.. దేశీయ స్టాక్ మార్కెట్లలో సూచీలు పతనమయ్యాయ్. అయితే.. అదానీ గ్రూప్‌ నుంచి జారీ అవుతున్న ఫాలో ఆన్‌ ఆఫర్‌.. ఎఫ్‌పీవోను దెబ్బతీసేందుకే.. అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్‌.. రిపోర్ట్ రిలీజ్ చేసిందని అదానీ గ్రూప్ ఆరోపిస్తోంది. తమ వివరణ తీసుకోకుండా, వాస్తవాల్ని సరిపోల్చుకోకుండా.. తప్పుడు సమాచారంతో రిపోర్ట్ తయారుచేశారని చెబుతోంది. భారత హైకోర్టులు తిరస్కరించిన నిరాధార ఆరోపణల్ని రిపోర్ట్‌లో పొందుపర్చారని అంటున్నారు. ఇక.. ఆరోపణల సంగతి ఎలా ఉన్నా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి.. మంచి రెస్పాన్స్ కనిపించింది. తాజా ఎఫ్‌పీఓలో.. 5 వేల 985 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. అదానీ గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ సహా.. 33 సంస్థాగత పెట్టుబడుల నుంచి నిధుల సేకరణకు ఉద్దేశించిన ఎఫ్‌పిఓ దుమ్మురేపింది. దాదాపు ఒకటిన్నర శాతం ఓవర్‌ సబ్‌స్ర్కైబ్‌ చేసింది ఎఫ్‌పిఓ.

Adani Group: అంబుజా, ఏసీసీ కంపెనీలకు అదానీ రూ.31,000 కోట్ల ఓపెన్ ఆఫర్

అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ప్రమోటర్ ఈక్విటీ క్యాపిటల్ ఇన్ఫ్యూషన్‌కు బలమైన ఆధారాలు ఉన్నప్పటికీ.. గ్రూప్‌కు కొన్ని పర్యావరణ, సామాజిక, కార్యాచరణ రిస్క్‌లు ఉన్నాయంటున్నారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా నిర్వహించే కంపెనీలకు సంబంధించి.. గ్రూప్‌కు బలమైన ట్రాక్ రికార్డ్ ఉంది. అలాగే.. భారత ఆర్థిక వ్యవస్థ సరైన పనితీరుకు సంబంధించిన.. మౌలిక సదుపాయాల పోర్ట్‌ఫోలియో కూడా ఉంది. అయితే.. ముందస్తు అనుభవం గానీ, నైపుణ్యం లేని వ్యాపారాల్లో అదానీ గ్రూప్ విస్తరణ మీదే రీసెర్చ్ సంస్థలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయ్. వీటిలో.. రాగి శుద్ధి, పెట్రోకెమికల్స్, టెలికమ్యూనికేషన్స్, అల్యూమినియం ఉత్పత్తి కంపెనీలు ఉన్నాయి.

ఏదేమైనా.. అదానీ కంపెనీలపై సంచలన రిపోర్ట్ ఇచ్చి.. వరల్డ్ వైడ్‌ హాట్‌ టాపిక్‌గా మారింది హిండెన్‌బర్గ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ సంస్థ. ఫైనాన్స్‌ అండ్‌ డాటా కంపెనీగా ప్రస్థానం ప్రారంభించిన ఈ సంస్థ.. రీసెర్చ్‌ సెంటర్‌గా ఎదిగింది. ఈక్విటీ, క్రెడిట్‌, డెరివేటివ్‌లను విశ్లేషించడం హిండెన్‌బర్గ్ పని. 2017 నుంచి దాదాపు 16 కంపెనీల అక్రమాలను.. ఈ రీసెర్చ్‌ సంస్థ బయటపెట్టింది. మార్కెట్లో ఎదిగేందుకు కంపెనీలు చేసే అక్రమ దందా గుట్టును రట్టు చేసింది. అయితే.. ఇప్పుడు అదానీ గ్రూప్‌ కంపెనీలు అప్పుల్లో కూరుకుపోయాయని ఆరోపిస్తూ.. రిపోర్ట్ ఇవ్వడంతో.. మున్ముందు మార్కెట్‌లో ఏం జరగబోతుందనేది ఆసక్తిగా మారింది.

Gautam Adani Assets Doubled : ఏడాది కాలంలోనే రెట్టింపైన అదానీ ఆస్తులు..ప్రపంచ అత్యంత సంపన్నుల్లో మూడో స్థానం