Gangavaram Port : అదానీ గ్రూప్‌ ఆధీనంలోకి గంగవరం పోర్టు

గంగవరం పోర్టు అదానీ కంపెనీ ఆధీనంలోకి వెళ్లింది. గంగవరం పోర్టు అదానీ గ్రూప్ పరిధిలోకి వచ్చిందని బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లకు అదానీ గ్రూప్ లేఖ రాసింది.

Gangavaram Port : అదానీ గ్రూప్‌ ఆధీనంలోకి గంగవరం పోర్టు

Gangavaram

Gangavaram port Adani Group : గంగవరం పోర్టు అదానీ కంపెనీ ఆధీనంలోకి వెళ్లింది. గంగవరం పోర్టు అదానీ గ్రూప్ పరిధిలోకి వచ్చిందని బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లకు అదానీ గ్రూప్ లేఖ రాసింది. దీంతో గంగవరం పోర్టు వంద శాతం అదానీ పరమైంది. పోర్టులో ఏపీ ప్రభుత్వ వాటా 10 పాయింట్‌ 4 శాతాన్ని అదానీ గ్రూప్‌కు అప్పగిస్తూ ఈ మేరకు ఏపీ మారిటైమ్‌ బోర్డ్‌ లేఖ రాసింది. ఏపీ సర్కార్‌ వాటా కోసం.. అదానీ గ్రూప్‌ 644 కోట్ల రూపాయలను చెల్లించింది

విమానయానశాఖను బలోపేతం చేసేందుకు.. ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సివిల్ ఏవియేషన్‌ మినిస్టర్‌ సింధియా లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్ ప్రదేశ్‌, అస్సాం, బీహార్‌, చత్తీస్‌గడ్‌ ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. విమానయాన శాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వ్యక్తిగతంగా చొరవ చూపాలని కోరారు. భూ కేటాయింపు, నిధుల డిపాజిట్ వంటి వివిధ విషయాలను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. దేశంలో పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్‌ను అందుకోవడానికి, విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధికి రానున్న నాలుగైదు ఏళ్లలో 20వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

ఏపీ ప్రభుత్వం విమానాశ్రయాల కోసం ఇప్పటికే భూకేటాయింపులు జరిగిందని విమానయానశాఖ మంత్రి తెలిపారు. అయితే…ఇంకా కొంత భూమి పెండింగ్‌లో ఉందని దాన్ని వెంటనే క్లియర్‌ చేయాలని కోరారు. తిరుపతిలో రన్‌వే విస్తరణ, ఇతర అవసరాలకు 14.31ఎకరాలు, రాజమండ్రిలో 10.25 ఎకరాలు, కడపలో 50 ఎకరాలు అప్పగించాల్సి ఉందన్నారు. విజయవాడ విమానాశ్రయంలో నాలుగు వేల మీటర్ల రన్‌వే పొడిగింపునకు ఏలూరు కాలువను డైవర్ట్‌ చేయాల్సి ఉంటుందని వెంటనే దానిపై దృష్టి పెట్టాలని కోరారు.

రీజనల్ ఎయిర్‌ కనెక్టివిటీ ఫండ్‌ ట్రస్ట్ కింద ఏపీ సాధ్యమైనంత త్వరగా…14కోట్ల 64లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని ఏపీ సీఎంను కోరింది ఏవియేషన్ మినిస్ట్రీ. ఇంటర్నేషనల్‌ ఉడాన్‌ ఆపరేషన్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం వందశాతం వీజీఎఫ్‌ సపోర్ట్‌ ఇచ్చేందుకు అంగీకరిస్తే రూట్లపై బిడ్డింగ్‌ పిలుస్తామన్నారు. దీంతో పాటు పలు ఇతర అంశాలను కూడా లేఖలో ప్రస్తావించారు.