Adani Group: అంబుజా, ఏసీసీ కంపెనీలకు అదానీ రూ.31,000 కోట్ల ఓపెన్ ఆఫర్
సెప్టెంబర్ 9 చివరి గడువుతో తాజా ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం.. అంబుజా సిమెంట్స్ ఒక్కో షేర్ 385 రూపాయలు గాను, ఏసీసీ 2,300 రూపాయలు గాను చెల్లించనుంది. అంబుజా సిమెంట్స్‌లో 51.63 కోట్ల ఈక్విటీ షేర్లను పబ్లిక్ వాటాదార్ల నుంచి కొనుగోలు చేసేందుకు 19,879 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. ఇక ఏసీసీలో 4.89 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు 11,259 కోట్లను వెచ్చించనుంది.

Adani Group 31k crore rupees open offer to ambuja and acc
Adani Group: ఇప్పటికే పలు రంగాల్లో అగ్ర స్థానంలో ఉన్న అదాని గ్రూప్.. తాజాగా సిమెంట్ రంగంలో కూడా రాణించాలని చూస్తోంది. ఇందులో భాగంగా అంబుజా సిమెంట్స్, ఏసీసీ కంపెనీలకు 31,000 కోట్ల రూపాయల ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. వాస్తవానికి ఈ రెండు కంపెనీల్లోని మెజారిటీ వాటాను స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్ అనే సంస్థ నుంచి 83,920 కోట్ల రూపాయలతో ఇప్పటికే కొనుగోలు చేస్తున్న అదానీ గ్రూప్.. మరో 26 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు తాజా ఆఫర్ ప్రకటించింది.
సెప్టెంబర్ 9 చివరి గడువుతో తాజా ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం.. అంబుజా సిమెంట్స్ ఒక్కో షేర్ 385 రూపాయలు గాను, ఏసీసీ 2,300 రూపాయలు గాను చెల్లించనుంది. అంబుజా సిమెంట్స్‌లో 51.63 కోట్ల ఈక్విటీ షేర్లను పబ్లిక్ వాటాదార్ల నుంచి కొనుగోలు చేసేందుకు 19,879 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. ఇక ఏసీసీలో 4.89 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు 11,259 కోట్లను వెచ్చించనుంది.
PM Modi No1 Again: ప్రపంచ నేతల్లో నరేంద్ర మోదీయే మళ్లీ నెంబర్ 1