PM Modi No1 Again: ప్రపంచ నేతల్లో నరేంద్ర మోదీయే మళ్లీ నెంబర్ 1

మొత్తం 22 మంది దేశాధినేతలతో విడుదల చేసిన ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఐదో స్థానంలో ఉండడం గమనార్హం. బిడెన్‭కు 41 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక బిడెన్ తర్వాత 39 శాతం ఓట్లతో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో నిలిచారు. ప్రస్తుతం మోర్నింగ్ కన్సల్ట్ ప్రపంచంలోని వివిధ దేశాల నేతల అప్రూవల్ రేటింగ్స్‌ను ట్రాక్ చేసింది.

PM Modi No1 Again: ప్రపంచ నేతల్లో నరేంద్ర మోదీయే మళ్లీ నెంబర్ 1

PM Modi tops list of most popular world leaders with 75 pc rating

PM Modi No1 Again:: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నేతల్లో నరేంద్రమోదీ మరోసారి నెంబర్ వన్‭గా నిలిచారు. గతంలో ఆయనకు 71 శాతం మంది సానుకూలంగా ఓటేసి నెంబర్ వన్ చేయగా.. ఈసారి ఆ మద్దతు మరింత పెరిగి 75 శాతం మంది మద్దతులో నెంబర్ వన్ స్థానాన్ని పదిల పర్చుకున్నారని ఒక సర్వే తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తర్వాత మెక్సికన్ అధ్యక్షుడు ఆండ్రెస్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ అబ్రేడర్ 63 శాతం అనుకూల ఓట్లతో రెండవ స్థానంలో ఉన్నారు. ఇక ఇటాలియన్ ప్రధానమంత్రి మారియో డ్రఘి 54 శాతం ఓట్లతో మూడవ స్థానంలో ఉన్నారు.

Bandi Sanjay padayatra : యువకుడిపై బీజేపీ కార్యకర్తల దాడి..బండి సంజయ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత..

మొత్తం 22 మంది దేశాధినేతలతో విడుదల చేసిన ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఐదో స్థానంలో ఉండడం గమనార్హం. బిడెన్‭కు 41 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక బిడెన్ తర్వాత 39 శాతం ఓట్లతో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో నిలిచారు. ప్రస్తుతం మోర్నింగ్ కన్సల్ట్ ప్రపంచంలోని వివిధ దేశాల నేతల అప్రూవల్ రేటింగ్స్‌ను ట్రాక్ చేసింది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, ఇటలీ, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా, స్పెయిన్, బ్రిటన్, అమెరికా దేశాల నేతల అప్రూవల్ రేటింగ్స్‌ను ట్రాక్ చేసింది.

Ghulam Nabi Azad: ఆజాద్ రాజీనామాపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. కీలక వ్యాఖ్యలు చేసిన జైరాం రమేష్

ప్రపంచ నేతలకు కల ప్రజాదరణను మోర్నింగ్ కన్సల్ట్ పరిశీలిస్తుంది. ఈ సంస్థ ఈ సర్వేను ప్రారంభించినప్పటి నుంచి ప్రదాని మోదీ అప్రూవల్ రేటింగ్స్ 2020 మే నెలలో అత్యధిక స్థాయిలో కనిపించాయి. అయితే గత ఏడాది కోవిడ్ రెండో ప్రభంజనం సమయంలో ఆయన అప్రూవల్ రేటింగ్స్ అతి తక్కువ స్థాయికి పతనమయ్యాయి. ఈ యేడాది జనవరిలో విడుదలైన ఒక సర్వేలో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొదటి స్థానంలో నిలిచారు. 71 శాతం మంది సానుకూలంగానూ, 21 శాతం మంది వ్యతిరేకంగానూ స్పందించడంతో ఆయనకు నెట్ అప్రూవల్ రేటింగ్ 50 ఉందని మార్నింగ్ కన్సల్ట్ సంస్థే వెల్లడించింది.

Operation Lotus in Telangana: ‘ఆపరేషన్ లోటస్’ తెలంగాణలో కార్యరూపం దాల్చలేకపోయింది: శివసేన

ప్రపంచ నేతల గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్ :
నరేంద్ర మోదీ : 75 శాతం
లోపెజ్ అబ్రేడర్ : 63 శాతం
మారియో డ్రఘి : 54 శాతం
బొల్సోనరో : 42 శాతం
జో బైడెన్ : 41 శాతం
జస్టిన్ ట్రుడు : 39 శాతం
కిషిడ : 38 శాతం
మాక్రోన్ : 34 శాతం
స్కోల్జ్ : 30 శాతం
బోరిస్ జాన్సన్ : 25 శాతం