Operation Lotus in Telangana: ‘ఆపరేషన్ లోటస్’ తెలంగాణలో కార్యరూపం దాల్చలేకపోయింది: శివసేన

ప్రస్తుతం ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని దుర్వినియోగం చేస్తూ నేతలను బెదిరిస్తూ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని శివసేన తన పత్రిక సామ్నాలో ఓ కథనం రాసుకొచ్చింది. ‘ఆపరేషన్ లోటస్’ దేశ ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదకరమో దీని ద్వారా తెలుస్తోందని పేర్కొంది. 2024 ఎన్నికల్లో గెలుస్తామో లేదోనని బీజేపీ ఆందోళన చెందుతోందని, ఆ ఎన్నికలను లక్ష్యం చేసుకుని కుట్రలకు పాల్పడుతోందని చెప్పింది. శరద్ పవార్, నితీశ్ కుమార్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రేవంటి ప్రతిపక్ష నేతలంటే బీజేపీ భయపడుతోందని శివసేన పేర్కొంది.

Operation Lotus in Telangana: ‘ఆపరేషన్ లోటస్’ తెలంగాణలో కార్యరూపం దాల్చలేకపోయింది: శివసేన

Operation Lotus in Telangana

Operation Lotus in Telangana:  ‘ఆపరేషన్ లోటస్’ బిహార్, తెలంగాణలో కార్యరూపం దాల్చలేకపోయిందని శివసేన చెప్పింది. అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ కుట్రలు పన్నుతోందని పేర్కొంది. మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టిన బీజేపీ ఇప్పుడు ఢిల్లీ సర్కారును కుప్పకూల్చడంపై దృష్టిసారించి, అందుకు ప్రయత్నాలు జరుపుతోందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తోన్న వేళ ‘ఆపరేషన్ లోటస్’పై శివసేన స్పందించింది.

ప్రస్తుతం ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని దుర్వినియోగం చేస్తూ నేతలను బెదిరిస్తూ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని శివసేన తన పత్రిక సామ్నాలో ఓ కథనం రాసుకొచ్చింది. ‘ఆపరేషన్ లోటస్’ దేశ ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదకరమో దీని ద్వారా తెలుస్తోందని పేర్కొంది. 2024 ఎన్నికల్లో గెలుస్తామో లేదోనని బీజేపీ ఆందోళన చెందుతోందని, ఆ ఎన్నికలను లక్ష్యం చేసుకుని కుట్రలకు పాల్పడుతోందని చెప్పింది.

శరద్ పవార్, నితీశ్ కుమార్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రేవంటి ప్రతిపక్ష నేతలంటే బీజేపీ భయపడుతోందని శివసేన పేర్కొంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు, ప్రతీకార పూరిత రాజకీయాలే బీజేపీ వద్ద ఉన్న అతి పెద్ద ఆయుధాలని చెప్పింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఇతర శివసేన రెబల్ ఎమ్మెల్యేలు కేంద్ర దర్యాప్తు సంస్థలకు భయపడి బీజేపీకి లొంగిపోయారని, ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యేలు మాత్రం లొంగలేదని పేర్కొంది.
Viral video: కొడుకుని ఎత్తుకుని రిక్షా తొక్కుతున్న తండ్రి.. కన్నీరు పెట్టిస్తోన్న వీడియో