Gold price : పసిడి ధరకు రెక్కలు..10 గ్రాముల బంగారం ధర రూ. 57,490..రూ. 60వేలు దాటుతుందంటున్న నిపుణులు

బంగారం పరుగులు పెడుతోంది. ఆగేదే లే అన్నట్టుగా పైపైకి ఎగబాకుతోంది. కొత్త రికార్డులు సృష్టిస్తున్న పసిడి ధరలు చూసి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అంతర్జాతీయ పరిణామాలు పుత్తడి ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. తొలిసారి 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం 57వేలు దాటింది. హైదరాబాద్‌లో నిన్న, ఇవాళ బంగారం ధర 57వేల490 రూపాయలు పలికింది. మూడు నెలల్లో బంగారం ధర 20శాతం పెరిగింది.

Gold price : పసిడి ధరకు రెక్కలు..10 గ్రాముల బంగారం ధర రూ. 57,490..రూ. 60వేలు దాటుతుందంటున్న నిపుణులు

Gold price :  బంగారం పరుగులు పెడుతోంది. ఆగేదే లే అన్నట్టుగా పైపైకి ఎగబాకుతోంది. కొత్త రికార్డులు సృష్టిస్తున్న పసిడి ధరలు చూసి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అంతర్జాతీయ పరిణామాలు పుత్తడి ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధ ప్రభావానికి తోడు అమెరికా ఆర్థికమాంద్యం భయాలు బంగారం సామాన్యులకు అందుబాటులో లేకుండా చేస్తున్నాయి. తొలిసారి 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం 57వేలు దాటింది. హైదరాబాద్‌లో నిన్న, ఇవాళ బంగారం ధర 57వేల490 రూపాయలు పలికింది. మూడు నెలల్లో బంగారం ధర 20శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు డాలర్ ధరతో ముడిపడి ఉంటాయి. డాలర్ విలువ పెరిగితే బంగారం ధర తగ్గుతుంది. డాలర్ విలువ పతనమైతే బంగారం ధర పెరుగుతోంది. ఇప్పుడు అదే జరుగుతోంది. గత ఏడాది ఇదే సమయంలో రూ. 52వేల 132గా ఉన్న బంగారం ఇప్పుడు రూ.5వేలకు పైగా పెరిగింది.

పసిడి ధరలకు రెక్కలు ఇప్పట్లో ఆగేలా లేదు. 10గ్రాముల బంగారం త్వరలోనే 60వేలకు చేరుతుందన్న అంచనాలు వెలువడుతూ…ఆడవారిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. పెళ్లిళ్ల సమయంలో మరింతగా ధరలు పెరగనున్నాయి. గత ఏడాది డాలర్ బలపడింది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచడం, అంతర్జాతీయ పరిస్థితులు డాలర్‌ను బలోపేతం చేశాయి. ఈ సమయంలో బంగారం ధరలు అదుపులోకి వచ్చాయి. ఎప్పుడైతే డాలర్‌ బలహీనపడడం మొదలయిందో..అప్పుడే పసిడి పైపైకి ఎగబాకింది. అమెరికాలో ఆర్థిక సంక్షోభం తలెత్తుతుందన్న ఆందోళన, వడ్డీ రేట్ల పెంపు తక్కువ ఉంటుందన్న ఫెడ్ రిజర్వ్ ప్రకటించడం వంటివి డాలర్‌ను బలహీనపరచగా బంగారం రేటును పెంచాయి.

గత ఏడాది అక్టోబరు, నవంబరులో బంగారం ధర 50వేల దిగువకు పడిపోయింది. ఈ ఏడాది ఆరంభం నుంచి ధర పెరుగుతూ వచ్చింది. 2023లో బంగారం రేట్లు 60వేల నుంచి 62వేల మధ్యకు చేరుతుందని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు. ద్రవ్యోల్బణం ఇలాగే ఉండడం, వడ్డీరేట్ల పెంపును అమెరికా తాత్కాలికంగా పక్కనపెట్టడం వంటి చర్యలు జరిగితే 2023 ప్రథమార్థంలోనే పది గ్రాముల బంగారం 60వేల మార్క్‌ను దాటుతుందని అంచనావేస్తున్నారు.

2020 ఆగస్టులో 56వేల 200 గరిష్టస్థాయిని నమోదుచేసింది బంగారం. ఆ తర్వాత అనేక ఒడిదుడుకులకు లోనయింది. నిజానికి కరోనా కాలం తర్వాత బంగారానికి డిమాండ్ 25శాతం తగ్గిందని అంచనా. అయితే ఇప్పుడు పెరుగుతున్న ధరలతో డిమాండ్ ఇంకా తగ్గిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం బంగారంపై 15శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని వచ్చే బడ్జెట్‌లో తగ్గిస్తే…ధరలు నియంత్రించవచ్చని భావిస్తున్నారు.