Ban On 5 Products Of Ramdev's Patanjali
Patanjali: యోగా గురు బాబా రామ్‌దేవ్‌కు చెందిన ప్రముఖ ఆయుర్వేద ఔషధ సంస్థ పతంజలి దివ్వ ఫార్మసీకి ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆయుర్వేద, యునానీ నియంత్రణ మండలి షాక్ ఇచ్చింది. ఐదు ఔషధాల తయారీని వెంటనే నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మధుగ్రిట్, ఐగ్రిట్, థైరోగ్రిట్, బీపీ గ్రిట్, లిపిడామ్ తదితర ఔషధాల తయారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశాల్లో పేర్కొంది. అనుమతులు పొందకుండా వీటి ఉత్పత్తని కొనసాగిస్తున్నారని, తమ అనుమతులు పొందిన తర్వాతే వీటి తయారీని తిరిగి ప్రారంభించాలని ఆదేశాల్లో పేర్కొంది. అలాగే తప్పుదోవ పట్టించే ప్రకటనలను వెంటనే నిలిపివేయాలని సైతం ఆదేశించింది.
మధుమేహం, గ్లకోమా (నీటి కాసులు), థైరాయిడ్, రక్తపోటు, కొలెస్ట్రాల్ అధిక రక్తపోటుకు ఈ ఔషధాలు చక్కని ఫలితమిస్తాయంటూ పతంజలి దివ్య ఫార్మసీ ప్రచారం చేసుకుంటోంది. తప్పుదోవ పట్టించే ఇటువంటి ప్రకటలను వెంటనే నిలిపివేయాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆయుర్వేద, యునానీ ఔషధ మండలి ఆదివారం ఆదేశించింది. భవిష్యత్తులో ఉత్పత్తులకు సంబంధించి ప్రకటనలు తమ అనుమతి పొందిన తర్వాతే ఇవ్వాలని ఆంక్షలు విధించింది. ఉల్లంఘిస్తే ఔషధ తయారీ లైసెన్స్ ను వెనక్కి తీసుకుంటామని హెచ్చరించింది. ఔషధ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా దివ్య ఫార్మసీ ప్రకటనలు ఇస్తున్నట్టు ఆరోపించింది.
Rajiv Gandhi Assassination: ఉగ్రవాదులం కాదు, బాధితులం.. రాజీవ్ గాంధీ హంతకులు