Artificial rain : ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు బయటి యాప్ ఆధారిత టాక్సీలపై నిషేధం…నవంబర్ 20-21 తేదీల్లో కృత్రిమ వర్షాలు

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం గురువారం పలు చర్యలు తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి యాప్ ఆధారిత టాక్సీల ప్రవేశాన్ని కూడా ఆప్ ప్రభుత్వం నిషేధించింది....

Ban On App Based Taxis

Artificial rain : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం గురువారం పలు చర్యలు తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి యాప్ ఆధారిత టాక్సీల ప్రవేశాన్ని కూడా ఆప్ ప్రభుత్వం నిషేధించింది. గాలిలో ఉన్న కాలుష్య కారకాలను నిర్మూలించేందుకు కృత్రిమ వర్షాల గురించి చర్చించారు. తాజాగా జరిగిన సమావేశం అనంతరం వర్షం కురిసే ప్రతిపాదనకు ఢిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఇప్పుడు నవంబర్ 20న వర్షం కురిసే అవకాశం ఉందని మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు.

Also Read : Encounter : జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌…లష్కరే తోయిబా ఉగ్రవాది హతం, కొనసాగుతున్న గాలింపు

ఆకాశంలో 40 శాతం మేఘాలు ఉన్నా వర్షం కురిసే అవకాశం ఉందని ఐఐటీ-కాన్పూర్ అధికారులు తెలిపారు. దేశ రాజధానిలో ప్రమాదకర గాలి నాణ్యతపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో వాయు కాలుష్యానికి దోహదపడే వాటిలో ఒకటైన రైతుల పొట్టును తగలబెట్టడాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. దట్టమైన విషపూరిత పొగమంచు దేశ రాజధానిపై కమ్ముుకుంది. గాలి నాణ్యత గురువారం పెరిగిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది.

Also Read : US singer Mary Millben : ప్రధాని మోదీకి యూఎస్ గాయకురాలు మేరీ మిల్‌బెన్ మరోసారి ప్రశంసలు

నగరంలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాలు కురిపించే అవకాశాలపై చర్చించేందుకు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఐఐటీ కాన్పూర్ బృందంతో సమావేశమయ్యారు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాలు కురిసే అవకాశాలపై చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడారు. నవంబర్ 20-21 తేదీల్లో ఢిల్లీలో వాతావరణం మేఘావృతమై ఉంటే కృత్రిమ వర్షం కురిపించవచ్చని మంత్రి తెలిపారు.

Also Read : Mahua Moitra : మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయండి… ఎథిక్స్ ప్యానెల్ సంచలన సూచన

కాన్పూర్ ఐఐటీ బృందం సమర్పించిన క్లౌడ్ సీడింగ్ ప్రతిపాదనను సుప్రీంకోర్టు ముందు పెడతామని మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. నవంబర్ 20-21 తేదీలలో ఢిల్లీలో మేఘావృతమై ఉండవచ్చని కాన్పూర్ ఐఐటీ నిపుణుల బృందం అంచనా వేసింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా నవంబర్ 9 నుంచి 18వతేదీ వరకు పాఠశాలలకు ముందస్తు శీతాకాల విరామం ప్రకటించింది.ఢిల్లీ, దాని శివారు ప్రాంతాల్లో గాలి నాణ్యత తీవ్రమైన కేటగిరీకి పడిపోయింది. పొరుగు రాష్ట్రాల్లో పంట కోత తర్వాత వరి గడ్డిని కాల్చడం వల్ల దేశ రాజధానిలో వాయు కాలుష్యం పెరిగింది.

ట్రెండింగ్ వార్తలు