బీటింగ్ రిట్రీట్: ముగిసిన గణతంత్ర దినోత్సవ వేడుకలు

  • Publish Date - January 29, 2019 / 03:11 PM IST

ఢిల్లీ:  గణతంత్ర దినోత్సవ  వేడుకల ముగింపు కార్యక్రమం (బీటింగ్ రీట్రీట్) ఢిల్లీలోని విజయ్ చౌక్ లో ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్,  ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ నేతలు, ఇతర ప్రముఖులు ఈకార్యక్రమానికి హాజరయ్యారు. రిపబ్లిక్ డే ముగింపు ఉత్సవాల సందర్భంగా  సైనికులు పలు విన్యాసాలు ప్రదర్శించారు. 

ఈ వేడుకలలో దాదాపు వెయ్యిమంది కళాకారులతో ఏర్పాటు చేసిన మిలటరీ బీజింగ్ బ్యాండ్స్ ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలలో మొత్తం 15 మిలిటరీ బ్యాండ్లు, 15 పైప్, డ్రమ్ బ్యాండ్లు పాల్గొనగా 19 భారత కంపొజిషన్లు, 8 వెస్ట్రన్ ట్యూన్లు పాల్గొనగా దశాబ్దాల కాలంనాటి సంప్రదాయాలకు గుర్తుగా బీజింగ్ రీట్రీట్ కార్యక్రమం జరిగింది.