Nitish Kumar: 2020లో తక్కువ సీట్లు గెలిచినా నేను సీఎం ఎందుకు అయ్యానో తెలుసా..? వెల్లడించిన నితీశ్

2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో జతకట్టిన నితీశ్.. బీజేపీ కంటే చాలా తక్కువ సీట్లే వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి అయ్యారు. దీని వెనుక బలమైన ఒత్తిడి ఉందని ఆయన తాజాగా వెల్లడించారు. ఎనిమదవసారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్.. బుధవారం అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొన్నారు. జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వం ఏర్పడ్డ అనంతరం మొదటి అసెంబ్లీ సమావేశం ఇదే.

Nitish Kumar: 2020లో తక్కువ సీట్లు గెలిచినా నేను సీఎం ఎందుకు అయ్యానో తెలుసా..? వెల్లడించిన నితీశ్

Lok Sabha polls 2024

Updated On : August 24, 2022 / 9:47 PM IST

Nitish Kumar: 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో జతకట్టిన నితీశ్.. బీజేపీ కంటే చాలా తక్కువ సీట్లే వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి అయ్యారు. దీని వెనుక బలమైన ఒత్తిడి ఉందని ఆయన తాజాగా వెల్లడించారు. ఎనిమదవసారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్.. బుధవారం అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొన్నారు. జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వం ఏర్పడ్డ అనంతరం మొదటి అసెంబ్లీ సమావేశం ఇదే.

Nana Patole: బ్రిటిషర్ల కంటే బీజేపీ చాలా క్రూరం.. అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది

కాగా, బల పరీక్షకు ముందు నితీశ్ మాట్లాడుతూ ‘‘2020 ఎన్నికల అనంతరం బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. ఆ పార్టీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని నేను కూడా అనుకున్నాను. కానీ, నా మీద వాళ్లు (బీజేపీ) బలమైన ఒత్తిడి తీసుకువచ్చారు. నన్నే ముఖ్యమంత్రి అవ్వమని చెప్పారు. చివరికి నేను అంగీకరించాల్సి వచ్చింది’’ అని వెల్లడించారు. అయితే ఆ సమయంలో బీజేపీ నుంచి సుశీల్ కుమార్ మోదీ, ప్రేమ్ కుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్నారని, వారిని కావాలనే పక్కన పెట్టి తనకు సీఎం కుర్చీని అప్పగించారని నితీశ్ అన్నారు.

10 facts about Gehlot: కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడని ప్రచారం జరుగుతున్న గెహ్లోత్ గురించి కీలక విషయాలు

ముఖ్యమంత్రిగా అయ్యేందుకు తాను ఒప్పుకున్న అనంతరం.. నంద కిశోర్ యాదవ్‭ను అసెంబ్లీ స్పీకర్ చేయమని తాను సూచించానని, అతడు తనకు మంచి మిత్రుడని, అయితే అందుకు బీజేపీ ఒప్పుకోలేదని నితీశ్ అన్నారు. కాగా, బీజేపీ బలవంతం వల్లే తాను ముఖ్యమంత్రి అయ్యానని చెప్పుకుంటున్న నితీశ్‭పై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఏర్పడ్డ ప్రభుత్వంలో బీజేపీ కంటే ఆర్జేడీకి ఎక్కువ స్థానాలు ఉన్నాయని, అయితే ఇప్పుడెందుకు నితీశ్ ముఖ్యమంత్రి అయ్యారో వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.